గజగజలాడుతున్న అగ్రరాజ్యం, ఎయిర్ పోర్టు, రిఫైనరీలు తాత్కాలిక మూసివేత, నో పవర్, టెంపరరీ కర్ఫ్యూ, టెక్సాస్‌లో ఎమర్జెన్సీ
అగ్రరాజ్యం అమెరికా మంచు తుపానులో చిక్కుకుపోయింది. టెక్సాస్, మెక్సికో తోపాటు అమెరికా సంయుక్త దక్షిణాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి...
అగ్రరాజ్యం అమెరికా మంచు తుపానులో చిక్కుకుపోయింది. టెక్సాస్, మెక్సికో తోపాటు అమెరికా సంయుక్త దక్షిణాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఉష్ణోగ్రతలు మైనస్ 2 నుంచి మైనస్ 22 సెల్సియస్‌గా ఉంటున్నాయి. లూసియానా, ఓక్లహామా, మిస్సోరీ, న్యూయార్క్ సిటీ, న్యూజెర్సీ రాష్ట్రాల్లో జనం టీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పవర్ గ్రిడ్లు ఫెయిలయ్యాయి. విద్యుత్‌ను పునరుధ్ధరించేందుకు అధికారులు నానా పాట్లు పడుతున్నారు. అమెరికాలోనే అతిపెద్ద క్రూడాయిల్ రిఫైనరీ, హూస్టన్‌లోని జార్జి బుష్ ఇంటర్ కాంటినెంటల్ ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేశారు.
టెక్సాస్, మెక్సికోల్లో 80 లక్షల మంది విద్యుత్ లేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ పునరుధ్ధరించగలిగినా.. ఇంకా చాలా ప్రాంతాల్లో పునరుద్ధరించాల్సి ఉంది. దాదాపు లక్షా 10 వేల ఇళ్ళు, కార్యాలయాలకు పవర్ సౌకర్యం లేకుండా పోయింది. ప్రజలు వీధుల్లోకి రాకుండా తాత్కాలిక కర్ఫ్యూ విధించారు. విద్యుత్ గ్రిడ్లు ఇంతగా పని చేయకపోవడం ఇదే మొదటిసారని అంటున్నారు అధికారులు. ఇవాళ కూడా మంచు తుపాను ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. టెక్సాస్‌లో ఎమర్జెన్సీ ప్రకటించిన అధ్యక్షుడు జోబైడెన్.. సాధ్యమైనంత త్వరగా ఈ సౌకర్యాన్ని పునరుధ్దరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Since the snow kept us from getting our paczkis today, we decided to *try* making our own. pic.twitter.com/e3lhD0iXcc
— Elissa Slotkin (@ElissaSlotkin) February 17, 2021
Read also : నేడు కేసీఆర్ పుట్టినరోజు : కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే పేరు