అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ భారీ సంస్కరణల దిశగా అడుగులేస్తున్నారు. కరోనా మహమ్మారి అమెరికాని కబలించినవేళ అమెరికన్ల కోసం కరోనా రిలీఫ్ ప్యాకేజ్‌ను బైడెన్ సర్కారు ప్రకటించింది. అంతేకాదు, హెచ్4 వీసా విషయంలోనూ సడలింపులు చేసింది. అమెరికా 46వ అధ్యక్షడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ కొత్త అధ్యక్షుడు జో బైడెన్ భారీ సంస్కరణ దిశగా అడుగులేస్తున్నారు. ఇవే కాకుండా హెచ్1బీ వీసాదారులకు, వలస దారులకు అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు. దీనిద్వారా హెచ్1బీ వీసాదారుల భాగస్వాములు కూడా ఉద్యోగాలు చేసే అవకాశం కల్పించారు.
ఇలా ట్రంప్ హయాంలో తీసుకున్న ఒక్కో వివాదాస్పద నిర్ణయాలను మారుస్తూ బైడెన్ సంస్కరణలకు తెర తీశారు. బైడెన్ నిర్ణయంపై అమెరికన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ ఫారిన్ పాలసీ గురంచి మొట్టమొదటి ప్రసంగమిచ్చారు. ప్రెసిడెంట్ బిడెన్ తోపాటు వైస్ ప్రెసిడెంట్ హారిస్, సెక్రటరీ బ్లింకెన్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా బైడెన్ ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తామని, అమెరికా ఈజ్ బ్యాక్ అంటూ నినదించారు. గత ట్రంప్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన వివాదాస్పద నిర్ణయాల్ని వెనక్కి తీసుకుని ముందుకు సాగుతామని బైడెన్ చెప్పుకొచ్చారు. అధ్యక్షుడి పూర్తి ప్రసంగ పాఠం ఈ దిగువ వీడియోలో చూడొచ్చు.
This afternoon, I’m visiting the @StateDept and delivering remarks on America’s role in the world. Tune in. https://t.co/zWG3UETxGX
— President Biden (@POTUS) February 4, 2021