US Fire Accident: న్యూయార్క్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 9మంది చిన్నారులతో సహా 19 మంది మృతి

అమెరికాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు.

US Fire Accident: న్యూయార్క్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 9మంది చిన్నారులతో సహా 19 మంది మృతి
Fire Accedent

Updated on: Jan 10, 2022 | 7:54 AM

New York Fire Accident: అమెరికాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. న్యూయార్క్‌లోని బ్రాంక్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో 9 మంది చిన్నారులు సహా 19 మంది చనిపోయారు. అగ్ని ప్రమాదంలో డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. కనీసం 32 మంది ఆసుపత్రి పాలయ్యారు. గాయపడ్డవారందరినీ సమీప ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నట్లు ఫైర్ డిపార్ట్‌మెంట్ న్యూయార్క్ కమిషనర్ డేనియల్ నీగ్రో తెలిపారు. ఈ ప్రమాదంలో కనీసం 63 మంది గాయపడ్డారని చెప్పారు.

భవనంలోని రెండు, మూడో అంతస్తుల్లోని డూప్లెక్స్‌ అపార్ట్‌మెంట్‌లో ఉదయం 11 గంటలకు మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో దాదాపు 200 మంది అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడం ప్రారంభించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ, న్యూయార్క్ నగరంలో మేము ఇక్కడ చూసిన అత్యంత ఘోరమైన అగ్నిప్రమాద సంఘటనలలో ఇది ఒకటి. న్యూయార్క్ నగరానికి ఇది భయానక మరియు బాధాకరమైన క్షణం అని కూడా అన్నారు. మరోవైపు, అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Read Also….. Booster Dose: నేటినుంచే కోవిడ్ -19 బూస్టర్ డోస్.. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే?