‘టిప్పుతో నో ఫైట్’… కొద్దిగా తగ్గిన కర్నాటక సర్కార్
ఈ ఏడాది విద్యాసంవత్సరంలో సిలబస్‌లో మార్పులు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై కర్ణాటక సర్కార్ కొద్దిగా వెనక్కి తగ్గింది. 18వ శతాబ్ధపు మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ ,హైదర్ అలీకి సంబంధించి పాఠ్యాంశాలను...

ఈ ఏడాది విద్యాసంవత్సరంలో సిలబస్‌లో మార్పులు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై కర్ణాటక సర్కార్ కొద్దిగా వెనక్కి తగ్గింది. 18వ శతాబ్ధపు మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ ,హైదర్ అలీకి సంబంధించి పాఠ్యాంశాలను తొలగిస్తూ చేసిన ప్రకటనను ప్రభుత్వం నిలిపివేసింది. అధికారంలోకి రాకముందు కూడా ఈ పాఠాలను తొలిగించాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలను నిర్వహించింది.
ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం ఖరారు కాలేదని, త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నట్లు పేర్కొంది యడ్డీ సర్కార్. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతుండటం… పాఠశాలలు తిరిగి ఎప్పుడు ప్రారంభంకానున్నాయో ఎవరూ చెప్పలేక పోతున్నారు.
అయితే సిలబస్‌లో మార్పుల అంశంపై తుది వివరాలను వెబ్‌సైట్‌లో వెల్లడిస్తామని తెలిపింది కర్నాటక సర్కార్. ఇప్పటికే టిప్పు సుల్తాన్, హైదర్ అలీ పాఠ్యాంశం తొలిగిస్తున్నారని ప్రచారం జరగడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.