యువరాజ్ మ్యాజికల్ ఇన్నింగ్స్..అయినా ఓడిన టీమ్!

Yuvraj Singh smashes 5 sixes in 'unbelievable knock' in Global T20 Canada, యువరాజ్ మ్యాజికల్ ఇన్నింగ్స్..అయినా ఓడిన టీమ్!

భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ తర్వాత తన బ్యాటింగ్ పవరేంటో చూపిస్తున్నాడు. ప్రస్తుతం గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో టోరంటో నేషనల్స్ టీమ్‌కి ఆడుతున్న యువరాజ్ సింగ్.. కేవలం 22 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 51 పరుగుల మ్యాజికల్ ఇన్నింగ్స్ ఆడాడు. అయినప్పటికీ.. యువీ టీమ్‌ 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. టోర్నీలో నాలుగో మ్యాచ్‌ ఆడిన టోరంటో జట్టుకి ఇది మూడో అపజయం.

బ్రాంప్టన్‌, టోరంటో టీమ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన టొరంటో కెప్టెన్ యువరాజ్ సింగ్.. ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో.. తొలుత బ్యాటింగ్ చేసిన బ్రాంప్టన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఆ జట్టులో జార్జ్ మున్సీ (66: 36 బంతుల్లో 6×4, 5×6), బాబర్ హయత్ (48 నాటౌట్: 18 బంతుల్లో 2×4, 5×6) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

ఛేజింగ్‌లో ఓపెనర్ బ్రెండన్ మెక్‌కలమ్ (36: 22 బంతుల్లో 1×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్‌తో టోరంటో జట్టుకి శుభారంభంమివ్వగా.. కెప్టెన్ యువరాజ్‌ సింగ్ తన దూకుడుతో టీమ్‌లో జోరుని కొనసాగించాడు. అతడు కొట్టిన సిక్సులు ఒకప్పటి వింటేజ్ యూవీని గుర్తుకుతెచ్చాయి. కానీ.. జట్టు స్కోరు 169 వద్ద యువరాజ్ ఔటవగా.. ఆఖర్లో ఒత్తిడికి గురైన టోరంటో 211/7కే పరిమితమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *