అక్కడ ఈత కొట్టాలంటే దమ్ముండాలి!

World's, అక్కడ ఈత కొట్టాలంటే దమ్ముండాలి!

ప్రపంచంలోనే తొలిసారిగా 700 అడుగుల ఎత్తులో 360 డిగ్రీ ఇన్ఫినిటీ పూల్ తయారీకి రంగం సిద్ధమవుతోంది. లండన్‌లో అత్యంత ఎత్తైన స్కైస్క్రాపర్‌లో దీన్ని నిర్మించనున్నారు. 55 అంతస్తులపై నిర్మించే ఈ ఇన్ఫినిటీ స్విమ్మింగ్‌పూల్‌ పూర్తిగా పారదర్శకం. ఈ స్విమ్మింగ్‌పూల్‌ను ఏ కోణంలో నుంచి చూసినా అందులో ఈత కొట్టేవారు స్పష్టంగా కనిపిస్తారు. అందుకే దీనికి 360 డిగ్రీ ఇన్ఫినిటీ పూల్ అని పేరుపెట్టారు. ఈ మేరకు సీత్రూ అక్రైలిక్ సైడ్స్, ట్రాన్సఫరెంట్ ఫ్లోర్‌లను ఏర్పాటు చేయనున్నారు. కాంపస్ పూల్స్ అనే సంస్థ దీని నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. గాజు కంటే పారదర్వకంగా బలంగా ఉండే అక్రైలిక్‌తో భవనం మొత్తం నిర్మిస్తారు. ఈ స్విమ్మింగ్‌పూల్‌లో ఆరు లక్షల లీటర్ల నీరు ఉంటుంది.

ఈ ఇన్ఫినిటీ పూల్‌కు సాధారణ స్విమ్మింగ్ పూల్ తరహాలో గట్టు (ప్లాట్‌ఫాం) ఉండదు. భవనం నాలుగు అంచులను ఆనుకుని ఈ స్విమ్మింగ్‌పూల్ ఉంటుంది. ఇందులోకి ప్రవేశించాలంటే అత్యాధునిక టెక్నాలజీతో సబ్‌మెరిన్ డోర్, రొటేటింగ్ స్పైరల్ స్టెయిర్ కేస్ ఏర్పాటు చేస్తున్నారు. ఇవి క్రిస్టల్‌‌గా ఉండి. భవనం, నీటిలో కలిసిపోతాయి. దీనివల్ల ఈ స్విమ్మింగ్‌పూల్‌ను ఎటువైపు నుంచి చూసినా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్‌గా కనిపిస్తుంది. అందులో ఈత కొట్టేవాళ్లు కూడా స్పష్టంగా కనిపిస్తారు. ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది నుంచి చేపట్టనున్నారు. ఇది పూర్తయితే.. ప్రపంచంలోని అద్భుత కట్టడాల్లో ఒకటిగా నిలిచిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *