Asia’s richest person: ఇకపై ఆసియా కుబేరుడు ముకేశ్ కాదు.. అతణ్ని వెనక్కి నెట్టింది ఎవరో తెలుసా.?

|

Dec 31, 2020 | 7:08 PM

Zhong as Asia's richest person: ‘ఆసియాలో అత్యంత కుబేరుడు ఎవరంటే ఠక్కున వచ్చే సమాధానం ముకేశ్ అంబానీ.. కానీ ఇప్పుడు ఆ సమాధానం చెబితే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే...

Asias richest person: ఇకపై ఆసియా కుబేరుడు ముకేశ్ కాదు.. అతణ్ని వెనక్కి నెట్టింది ఎవరో తెలుసా.?
Follow us on

Zhong as Asia’s richest person: ‘ఆసియాలో అత్యంత కుబేరుడు ఎవరంటే ఠక్కున వచ్చే సమాధానం ముకేశ్ అంబానీ.. కానీ ఇప్పుడు ఆ సమాధానం చెబితే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ముకేశ్‌ను వెనక్కి నెడుతూ ఓ చైనా కుబేరుడు ముందుకొచ్చాడు. అతనే చైనా దేశానికి చెందిన జాంగ్ అనే వ్యాపార వేత్త. ఈయన సంప‌ద ఒక్క 2020లోనే ఏకంగా 7090 కోట్ల డాల‌ర్లు పెర‌గ‌డంతో ఆసియాలో సంపనున్న జాబితాలో తొలి స్థానంలో నిలిచాడు.
జాంగ్ ప్రపంచంలోని సంప‌న్నుల జాబితాలో ప్రస్తుతం11వ స్థానంలో ఉన్నాడు. ఈ విషయాన్ని బ్లూమ్‌బ‌ర్గ్ బిలియ‌నీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. జాంగ్‌కు చెందిన వ్యాక్సిన్ సంస్థ బీజింగ్ వాంటాయ్, ఓ వాటర్ బాటిల్ సంస్థ స్టాక్ మార్కెట్లో భారీగా లాభాలు ఆర్జించాయి. దీంతో జాంగ్‌కు ఈ ఏడాదే 7090 కోట్ల డాలర్ల ఆదాయం వచ్చే చేరింది.

Also Read: Reliance Jio : వినియోగదారులకు జియో న్యూ ఇయర్ గిఫ్ట్.. 2021 జనవరి 1 నుంచి అన్ని కాల్స్ ఉచితం