కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నా అవి తప్పనిసరి.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన అమెరికా వైద్యులు.

|

Dec 28, 2020 | 8:00 PM

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారికి ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్‌ వస్తోంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే వ్యాక్సిన్‌ అందజేయడం ప్రారంభమైంది. మన దేశంలోనూ డ్రైరన్‌లను నిర్వహిస్తున్నారు. త్వరలోనే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందుబాటులో వచ్చే అవకాశాలున్నాయి. అయితే...

కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నా అవి తప్పనిసరి.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన అమెరికా వైద్యులు.
Follow us on

You May spread COVID-19 after vaccination: ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారికి ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్‌ వస్తోంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే వ్యాక్సిన్‌ అందజేయడం ప్రారంభమైంది. మన దేశంలోనూ డ్రైరన్‌లను నిర్వహిస్తున్నారు. త్వరలోనే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందుబాటులో వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఇక వ్యాక్సిన్‌ తీసుకున్నాం.. ఇన్ని రోజుల నుంచి నోటికి అడ్డుగా పెట్టుకున్న మాస్కులను ఎంచక్కా పక్కన పెట్టేయొచ్చని అనుకుంటున్నారా? అయితే అలా చేయడానికి వీల్లేదని చెబుతున్నారు వైద్య నిపుణులు.
కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్న వ్యక్తి నుంచి ఇతరులకు వైరస్‌ సంక్రమిస్తుందా అన్ని కోణంలో పరిశోధన జరిపిన అమెరికా వైద్యులు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతానికి వ్యాక్సిన్‌లు వైరస్‌పై ప్రభావితం చూపుతున్నాయనడానికి ఆధారాలున్నా.. టీకా వేసుకున్న వ్యక్తి నుంచి వైరస్‌ ఇతరులకు వ్యాప్తి చెందదన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్‌ వేసుకున్న వారు తమకు తెలియకుండానే తమ శరీరంలోని వైరస్‌ను ఇతరులకు అంటించే ప్రమాదం ఉందనేది వారి వాదన. అందుకే వ్యాక్సినేషన్‌ చేసుకున్నా.. మాస్క్‌లు ధరించడం, సోషల్‌ డిస్టెంట్స్‌ పాటించడం ఆపకూడదని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్‌ వేసుకున్న వ్యక్తుల శరీరాల్లోకి వైరస్‌ మళ్లీ వెళ్లే అవకాశముంటుంది. అయితే అది వ్యాక్సిన్‌ వేసుకున్న వారిపై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపకపోయినా.. ఇతరులకు ఇబ్బందిగా మారే అవకాశముందని చెబుతున్నారు. అందులోనూ వ్యాక్సిన్‌ వేసుకున్న వ్యక్తులకు మరోసారి వైరస్‌ సోకినట్లు లక్షణాలు కూడా కనిపించవు. కాబట్టి వ్యాక్సిన్‌ వేసుకున్నామన్న ధీమాతో మునపటిలా జీవితాన్ని ఇప్పుడే ప్రారంభించకపోవడమే బెటర్‌ అని నిపుణులు సూచిస్తున్నారు.