Goat Man Dies: తలపై రెండు కొమ్ములున్న మేక తాత 140వ ఏట మృతి.. వరల్డ్ రికార్డు సృష్టించిన గోట్ మెన్ ఇక లేరు..

వరల్డ్ రికార్డ్ సృష్టించిన గోట్ మెన్ ఇక లేరు. 140 ఏళ్లు ఆరోగ్యంగా జీవించిన ఆయన తన కొమ్మును తొలిగించుకునేందుకు చేసిన ప్రయత్నంతో చనిపోయాడు. అతను ఎవరు.? ఎంత కాలం ఎక్కడ ఉన్నాడు..? ఇలాంటి వివరాను ఇక్కడ తెలుసుకుందాం..

Goat Man Dies: తలపై రెండు కొమ్ములున్న మేక తాత 140వ ఏట మృతి.. వరల్డ్ రికార్డు సృష్టించిన గోట్ మెన్ ఇక లేరు..
Goat Man

Updated on: Mar 21, 2023 | 1:19 PM

తలపై రెండు కొమ్ములు, తోక కలిగిన మనిషి.. ఇలాంటివి మనం ఫిక్షన్ చిత్రాల్లో చూస్తుంటాం. అయితే, చరిత్రలో కొన్ని చోట్ల ఇలాంటివారు ఉండటం.. అలాంటి వార్తలను మనం చాలా తక్కువగా చూస్తాం. అయితే, సోషల్ మీడియా పెరిగిన తర్వాత విచిత్రమైన ఇటువంటి కేసులు తరచుగా తెరపైకి వస్తున్నాయి. వీటిని విశ్వసించడం అంత సులభం కాదు. ఉదాహరణకు, జంతువుల కొమ్ముల గురించి చెప్పాలంటే.. మీరు ఎద్దులు, మేకల కొమ్ముల గురించి చాలా కథలు చూసి ఉంటారు.. విని ఉంటారు. కానీ ఒక వ్యక్తి కొమ్ములు బయటకు వస్తే, అది కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది. వింతగా ఉన్నా ఇది 100% నిజం. ఎందుకంటే తన కొమ్ముతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అలీ ఎంటర్ ఇప్పుడు ప్రపంచానికి వీడ్కోలు పలికాడు.. అతను తన 140 ఏళ్ల వయస్సులో హార్న్ ఆపరేషన్ సమయంలో మరణించారు. అలీని ది టూ-హార్న్డ్  మన్ అని కూడా పిలుస్తారు. అతను యెమెన్ ప్రభుత్వం నుంచి ఈ పేరును పొందాడు.

అలీ నుదిటికి రెండు వైపులా కొమ్ము లాంటాయి. అవి నిరంతరం పెరుగుతుండటం… ఆ కొమ్ములు అతని నోటి వరకు రావడంతో అతనికి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అతని కొమ్ములలో ఒకటి పెద్దది, మరొకటి చిన్నది.

అతని కొమ్ములలో ఒకదానిలోని వంపు మేక కొమ్ములా ఉంది. ఈ కారణంగా, అతని కుటుంబం శస్త్రచికిత్స ద్వారా ఆ కొమ్మును తొలగించాలని నిర్ణయించుకుంది. అయితే ఆపరేషన్‌ చేయకపోవడం వల్లే మృతి చెందినట్లు చెబుతున్నారు.

అలీ చనిపోవడానికి మూడు రోజుల ముందు ఆ ఆపరేషన్ జరిగింది. ఇందులో అతని నుదిటిపై కొమ్ము ఉన్నట్లు మనం చూడవచ్చు. అతనికి ఆపరేషన్ చేసే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ప్రపంచానికి ఇతని గురించి తెలిసింది.

అయితే, అలీ 140 ఏళ్ల వయస్సులో శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణించడం వల్లే అలీ మరణించాడని అలీ కుటుంబ సభ్యుడు పేర్కొన్నారు. అంతర్జాతీయ పత్రిక ‘ది సన్’లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం, అలీ 100 సంవత్సరాల పాటు ఆరోగ్యంగా, యువకుడిలా నడిచేవాడు. అతని జ్ఞాపకశక్తి 2017 వరకు అద్భుతంగా ఉందని పేర్కొంది. ఆ తర్వాత అతని పరిస్థితి మరింత దిగజారిందని తెలిపింది.

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అలీ పేరు నమోదైంది. వైద్య శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం, అలీకి ఈ కొమ్ము ఒక రకమైన చర్మ కణితి అని తెలిపింది. శరీరంలో కెరాటిన్ అధికంగా ఉండటం వల్ల ఇలా పెరిగిందని తెలిపింది. దీని వల్ల మన శరీరంలోని వెంట్రుకలు, గోళ్లు, డెక్కలు తయారవుతాయని తెలిపింది.

పూర్తి వివరాలను ఈ సైట్‌లో చూడగలరు

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం