Worlds Coldest City: ప్రపంచంలోనే అత్యంత శీతల నగరం.. ఇక్కడ కనురెప్పలు కూడా గడ్డకట్టుకుపోతాయి..

భారత్‌తో సహా ప్రపంచంలోని అనేక దేశాలు పొగమంచు, విపరీతమైన చలిని అనుభవిస్తున్నాయి. కాశ్మీర్, శ్రీనగర్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. తీవ్రమైన చలి సాధారణ జనజీవనాన్ని ప్రభావితం చేసింది. చలి తీవ్రత నుంచి తప్పించుకుని బయటపడేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ దారులు వెతుకుతున్నారు. చలిగాలులు వీస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. జనవరి 21 నుంచి జనవరి 25 వరకు ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. అయితే ప్రపంచంలో అత్యంత […]

Worlds Coldest City: ప్రపంచంలోనే అత్యంత శీతల నగరం.. ఇక్కడ కనురెప్పలు కూడా గడ్డకట్టుకుపోతాయి..
Worlds Coldest City

Updated on: Jan 19, 2023 | 9:22 PM

భారత్‌తో సహా ప్రపంచంలోని అనేక దేశాలు పొగమంచు, విపరీతమైన చలిని అనుభవిస్తున్నాయి. కాశ్మీర్, శ్రీనగర్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. తీవ్రమైన చలి సాధారణ జనజీవనాన్ని ప్రభావితం చేసింది. చలి తీవ్రత నుంచి తప్పించుకుని బయటపడేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ దారులు వెతుకుతున్నారు. చలిగాలులు వీస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. జనవరి 21 నుంచి జనవరి 25 వరకు ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. అయితే ప్రపంచంలో అత్యంత శీతల నగరం ఏదో తెలుసా? ఇక్కడ కను రెప్పలు కూడా చలితో గడ్డకట్టుకుపోతాయట..

యాకుటియా.. ప్రపంచంలోనే అత్యంత శీతల నగరం. ఈ నగరం రష్యాలోని యాకుట్స్క్ ప్రావిన్స్‌లో ఉంది. -50 డిగ్రీల ఉష్ణోగ్రతతో ప్రపంచంలోనే అత్యంత శీతల నగరం. ఆదివారం ఈ నగరంలో -51 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. యాకుటియా రష్యా రాజధాని మాస్కోకు తూర్పున దాదాపు 5,000 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడి ఫిష్ మార్కెట్‌లకు బహుశా ఫ్రీజర్‌లు అవసరం లేదు. ఈ నగరంలో అతి శీతలంగా ఉంటుంది. యాకుట్స్క్‌లో -60 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరుగుతుందని చెప్పారు. -40 డిగ్రీల వరకు నమోదవుతుందని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. అసాధారణంగా తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా నగరం మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంది. ప్రజల కనురెప్పలు కూడా గడ్డకట్టుకుపోతాయి. యాకుట్స్క్ రష్యాలోని తూర్పు ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 40 కంటే తక్కువగా ఉంది. యాకుట్స్క్ ప్రావిన్స్‌లో ఉష్ణోగ్రతలు ఏడాది పొడవునా సున్నా కంటే తక్కువగా ఉంటాయి. శీతాకాలంలో పరిస్థితి మరింత దిగజారుతుంది.

చలి నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడుతున్నామని యాకుటియా వాసులు చెబుతున్నారు. చలి నుంచి తప్పించుకోవడానికి ఇక్కడి ప్రజలు ఎప్పుడూ వాతావరణానికి అనుగుణంగా దుస్తులు ధరిస్తారు. తీవ్రమైన చలికి తోడు యాకుటియా పట్టణవాసులు ఆహార కొరతను కూడా ఎదుర్కొంటున్నారు. ఇక్కడి ప్రజలు ఎక్కువగా మాంసం ఆధారిత ఆహారంపై ఆధారపడి జీవిస్తున్నారు. 2021 జనాభా లెక్కల ప్రకారం, యాకుట్స్క్‌లో 355,443 మంది నివసిస్తున్నారు. వేసవిలో కూడా, ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువగా ఉంటుంది. నీరు గడ్డకట్టడం నివాసితులకు పెద్ద సవాలుగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..