Worlds Best Cities 2025: ప్రపంచంలోని ఉత్తమ నగరాలు.. వరుసగా పదో ఏడాది కూడా వరల్డ్ బెస్ట్ సిటీ ఇదే..!

|

Nov 22, 2024 | 9:14 AM

2025 ఏడాదికి సంబంధించిన టాప్‌-100 జాబితాలో అత్యధికంగా అమెరికాలోని 36 నగరాలు స్థానం సంపాదించడం విశేషం. కానీ, ఈ జాబితాలో భారతదేశంలోని అతిపెద్ద నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్‌‌కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు

Worlds Best Cities 2025: ప్రపంచంలోని ఉత్తమ నగరాలు.. వరుసగా పదో ఏడాది కూడా వరల్డ్ బెస్ట్ సిటీ ఇదే..!
Worlds Best Cities 2025
Follow us on

ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా లండన్ సిటీ నిలిచింది. గత పదేళ్లుగా లండన్ నగరం నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ.. వరల్డ్ బెస్ట్ సిటీగా ఉంటోంది. నంబర్ 1 – లండన్, నంబర్ టూ – న్యూయార్క్, నంబర్ త్రీ – పారిస్…. రెసోనన్స్ కన్సల్టెన్సీ సంస్థ ఇప్సోస్‌తో కలిసి నిర్వహించిన ‘వరల్డ్ బెస్ట్ సిటీస్ సర్వే 2025’లో టాప్-త్రీ సిటీస్ ఇవే. లండన్ తర్వాత స్థానాల్లో న్యూయార్క్, పారిస్, టోక్యో, సింగపూర్, రోమ్, మాడ్రిడ్, బార్సిలోనా, బెర్లిన్, సిడ్నీ, తదితర నగరాలు టాప్-10లో ఉన్నాయి.

రియల్ ఎస్టేట్, టూరిజం, ఆర్థికాభివృద్ధి రంగాల్లో అంతర్జాతీయ సలహదారుగా ఉన్న రిసోనెన్స్ సంస్థ ఈ వరల్డ్ బెస్ట్ సిటీస్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఏ నగరంలో జీవించాలనుకుంటున్నారు? ఏ నగరాన్ని చూడాలనుకుంటున్నారు? ఏ నగరంలో ఉద్యోగం చేయాలని కలలు కంటున్నారనే అంశాల ప్రాతిపదికన ఈ టాప్ సిటీస్ జాబితాను రూపొందిస్తారు. ఈ సర్వే కోసం రెసోనన్స్ టీమ్ 31 దేశాల్లోని 22,000 మందిని సర్వే చేసింది.

2025 ఏడాదికి సంబంధించిన టాప్‌-100 జాబితాలో అత్యధికంగా అమెరికాలోని 36 నగరాలు స్థానం సంపాదించడం విశేషం. కానీ, ఈ జాబితాలో భారతదేశంలోని అతిపెద్ద నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్‌‌కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు ఏమైనా చోటు దక్కిందా అంటే…లేదనే చెబుతున్నారు. ఈ నగరాలకు అసలు టాప్-100లో కూడా చోటు దక్కలేదని రెసోనన్స్ కన్సల్టెన్సీ సీఈఓ క్రిస్ ఫెయిర్ రాయిటర్స్ వార్తా సంస్థతో వివరించినట్టుగా సమాచారం.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..