COVID-19 Variants: కలవరపెడుతున్న కొత్త రకం వైరస్‌.. ప్రపంచ వ్యాప్తంగా 4 వేల కొత్త కరోనా రకాలు

|

Feb 06, 2021 | 7:21 AM

COVID-19 Variants: ఒక వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంటే మరో వైపు యూకే కొత్తరకం కరోనా వైరస్‌ భయాందోళనకు గురి చేస్తోంది..

COVID-19 Variants: కలవరపెడుతున్న కొత్త రకం వైరస్‌.. ప్రపంచ వ్యాప్తంగా 4 వేల కొత్త కరోనా రకాలు
Follow us on

COVID-19 Variants: ఒక వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంటే మరో వైపు యూకే కొత్తరకం కరోనా వైరస్‌ భయాందోళనకు గురి చేస్తోంది. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 4 వేల కరోనా కొత్త రకాలు ఉన్నాయని బ్రిటన్‌ మంత్రి నదీమ్‌ జహావీ వెల్లడించారు. వాటిని దృష్టిలో పెట్టుకుని ఫైజర్‌, ఆస్టాజెనెకా సహా అన్ని టీకాల తయారీ సంస్థలు తమ టీకాలను మెరుగు పర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. కరోనా వైరస్‌ రూపాంతరం చెందుతూ అనేక రకాల వైరస్‌ను వెలుగులోకి వచ్చాయన్నారు. బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ రకాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 4వేల కరోనా రకాలు ఉన్నాయని, తాము కొత్త రకాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని బ్రిటన్‌ తెలిపింది.

కరోనా వైరస్‌ రూపాంతరం చెందుతూ కొత్త రకాల వైరస్‌లు ఏర్పడుతుండటంతో అన్ని రకాల వైరస్‌లపై అధ్యయనం చేస్తూ స్పందించడానికి సిద్ధంగా ఉన్నామని బ్రిటన్‌ మంత్రి తెలిపారు. 2019 చివరిలో చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్‌ కొద్ది నెలల్లోనే ప్రపంచాన్ని చుట్టేసింది. ఇప్పటి వరకు 10 కోట్ల మందికిపైగా కరోనా బారిన పడగా, 22 లక్షలకుపైగా మృత్యువాత పడ్డారు. అయితే టీకాలు వచ్చాయని ఆనందపడేలోపే ఈ కొత్తరకం వైరస్‌ ఆందోళన కలిగిస్తోంది. కాగా బ్రిటన్‌లో విజృంభిస్తున్న కొత్త రకం వైరస్‌ 80కిపైగా దేశాలకు పాకింది.

Also Read: New virus: 82 దేశాల్లో వేగంగా విస్తరించిన కొత్తరకం వైరస్‌.. బ్రిటన్‌, దక్షిణాఫ్రికాల్లో గుర్తింపు