పాత్రికేయురాలైన నన్ను వేశ్యగా ప్రచారం చేస్తున్నారు.. ఆవేదనతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు..ఎక్కడంటే

చైనాకు చెందిన ఓ పాత్రికేయురాలిపై కొంతమంది చైనా ఏజెంట్లు ఆమె ఒక వేశ్య అని ప్రచారం చేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే చైనా దేశస్థురాలైన సూ యుటాంగ్ అనే పాత్రికేయురాలు ప్రస్తుతం జర్మనీలో ఉంటున్నారు.

పాత్రికేయురాలైన నన్ను వేశ్యగా ప్రచారం చేస్తున్నారు.. ఆవేదనతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు..ఎక్కడంటే
Woman

Updated on: Apr 06, 2023 | 3:38 PM

చైనాకు చెందిన ఓ పాత్రికేయురాలిపై కొంతమంది చైనా ఏజెంట్లు ఆమె ఒక వేశ్య అని ప్రచారం చేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే చైనా దేశస్థురాలైన సూ యుటాంగ్ అనే పాత్రికేయురాలు ప్రస్తుతం జర్మనీలో ఉంటున్నారు. అయితే 1989 లో బీజింగ్ లోని తియాన్మిన్‌ స్వ్కేర్‌లో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలను చెపట్టారు. దీంతో దేశం మొత్తం అలజడి చెలరేగింది. అయితే ఈ నిరసనలను చైనా ప్రభుత్వం క్రూరంగా అణచివేసింది. చైనా ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ప్రజస్వామికవాదులు అప్పుడప్పుడు ప్రపంచంలోని పలు చోట్ల ర్యాలీలు చేపడుతుంటారు. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి జర్మనీలో జరిగిన ఓ ప్రదర్శనలో పాత్రికేయురాలైన సూ యుటాంగ్ కూడా పాల్గొన్నారు. అయితే ఆమె ఈ నిరసనలో పాల్గొనడంతో చైనా ఏజెంట్లకు లక్ష్యంగా మారారు. వాస్తవానికి చైనాకు వ్యతిరేకంగా ఉన్నవారిని చైనా ఏజెంట్లు లక్ష్యంగా చేసుకుంటాయి. వారి దగ్గరికి నేరుగా వెళ్లకపోయినప్పటికీ సమాజంలో వారి వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసి, అప్రతిష్ట పాలు చేసేందుకు రకరకాల వ్యూహాలు చేస్తాయి. ఇలాంటి పన్నాగలకు పాల్పడే చైనాపై విమర్శలు కూడా ఉన్నాయి.

అయితే సూ యుటంగ్ ను సోషల్ మీడియాలో చైనా ఏజెంట్లు వేశ్యగా ప్రచారం చేశారు. అనంతంరం ఆమె ఫోన్, అడ్రస్ ను కూడా ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు. అయితే సోషల్ మీడియా ఖాతాలకు బెదిరింపు రావడంతో వాటిని మూసేశారు. కానీ ప్రతిరోజు సూ యుటంగ్ కు వందలాది మెసేజ్ లు వస్తున్నాయి. అలాగే కొంతమంది ఆమె ఇంటికి వచ్చి తలుపులు కూడా కొడుతున్నారట. ఈ వేధింపులను తట్టుకోలేక పోయిన ఆమె.. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె చిత్రాలను మార్ఫింగ్ చేసి ఆన్ లైన్ పెట్టడంతో పాటు ఎస్కార్టు సర్వీసులు అందజేస్తున్నట్లు ఫోన్ నెంబర్లు ఇవ్వడంతో తరచుగా కొత్త వాళ్లు ఫోన్ చేస్తునట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే తన ఫోన్ కు అసభ్యకరమైన మెసెజ్ లు పంపుతున్నట్లు వాపోయారు. మరోవైపు ఆమెకు వ్యతిరేకంగా ఉన్న కథనాలను చైనా అనుకూల మీడియా ప్రసారాలు చేస్తోంది. చైనా వ్యతిరేకంగా ఉన్నవారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఇలాంటి వేధింపులకు లక్ష్యంగా మారుతున్నట్టు మీడియా వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..