Viral News: భర్త మరణించిన 14 నెలలకు.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

|

Jul 21, 2021 | 3:53 PM

40 ఏళ్ల ఓ మహిళ.. తన భర్త మరణించిన 14 నెలల తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇది కచ్చితంగా షాకింగ్ విషయమే. చాలా ఆశ్చర్యపరిచే అంశమే. అసలు అదెలా సాధ్యం అనకుంటున్నారా..?

Viral News: భర్త మరణించిన 14 నెలలకు.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
Oklahoma Women
Follow us on

40 ఏళ్ల ఓ మహిళ.. తన భర్త మరణించిన 14 నెలల తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇది కచ్చితంగా షాకింగ్ విషయమే. చాలా ఆశ్చర్యపరిచే అంశమే. అసలు అదెలా సాధ్యం అనకుంటున్నారా..?. అక్కడికే వస్తున్నాం.  పిండాన్ని ఐవిఎఫ్ పద్దతిలో అప్పటికే స్టోర్ చేసి ఉంచడం ద్వారా సారా షెలెన్‌బెర్గర్ అనే మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అమెరికాలోని ఓక్లహామాకు చెందిన ఆమె మే 3న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తన పిల్లలకు తండ్రిలేని లోటు రాకుండా చూసుకుంటానని ధీమాగా చెబుతోంది సారా. చిన్నారి రాకతో తన మాతృహృదయం ఉప్పొంగిందని.. బిడ్డను గుండెలకు హత్తుకోవడం గొప్ప అనుభవాన్ని ఇస్తోందని చెప్పింది. ఆమె భర్త స్కాట్‌(41) గతేడాది ఫిబ్రవరిలో హార్ట్ అటాక్‌తో కన్నుమూశారు. అతను మరణించిన 6 నెలల అనంతరం.. బార్బడోస్ ఫెర్టిలిటీ క్లినిక్‌ సహకారంతో సారా ఈ ప్రక్రియను కంప్లీట్ చేసింది. తాము కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని భావించేవాళ్లమని… ఈ సమయంలో బిడ్డకు జన్మనివ్వాలన్న నిర్ణయానికి తన భర్త మద్దతు ఉందని కచ్చితంగా చెప్పగలనని వివరించింది. బిడ్డ పుట్టినప్పటి నుంచి తన జీవితానికి ఒక అర్థం దొరికినట్లు ఉందని, పిల్లలకు తండ్రిలేని లోటు లేకుండా పెంచుతా అని ధైర్యంగా చెబుతుంది. కాగా మరో పిండం కూడా భద్రపరచి ఉందట. అదే చివరిదని… దానితో వచ్చే ఏడాది చివరి నాటికి రెండో బిడ్డను కనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని సారా షెలెన్‌బెర్గర్  చెప్పారు. సారా తన భర్త, బిడ్డతో దిగిన అనేక ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అవి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తెగ సర్కులేట్ అవుతున్నాయి.

దక్షిణ నజరేన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు సారా, స్కాట్ కలుసుకున్నారు. వారి పరిచయం ప్రేమగా మారింది. సెప్టెంబర్ 2018 లో వివాహం చేసుకున్నారు. వారిద్దరూ కనీసం ముగ్గురు పిల్లలు కావాలని కోరుకున్నారు. కానీ వారి కోరిక నెరవేరలేదు. చాలాకాలం నిరీక్షణ తర్వాత  వైద్యులు ఐవిఎఫ్‌ను ఎంచుకోవాలని వారికి సలహా ఇచ్చారు. యుఎస్‌లో ఐవిఎఫ్ కాస్ట్ ఎక్కువగా ఉండటంతో, ఈ జంట బార్బడోస్ ఫెర్టిలిటీ సెంటర్‌కు వెళ్లారు. కానీ, బిడ్డ పుట్టకముందే ఆమె భర్త కన్నుమూశారు. పిండం ప్రక్రియను ప్రారంభించడానికి ముందు సారా, ఆమె భర్త పేపర్ వర్క్ పూర్తి చేశారు. జీవిత భాగస్వామి చనిపోతే పిండాలకు సంబంధించి తదుపరి ప్రక్రియ ఎలా అనుసరించాలో అందులో రాసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ఆమెకు బిడ్డను కనేందుకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు.

Also Read: క్రేజీ ఫిష్.. కొండలు సైతం ఎక్కగలదు.. మరో షాకింగ్ విషయం ఏంటంటే..?

ఆకాశం నుంచి ఆశ్చర్యకర రీతిలో వచ్చిన మృత్యు పాశం… ఓ వ్యక్తిని బలితీసుకున్న నెమలి..