Tammy Slaton: 300 కిలోల బరువున్న భార్య.. తన భర్త 14 కేజీలు బరువు పెరిగాడని విడాకులు.. మరొకరితో డేటింగ్..

వాస్తవానికి టామీ, కాలేబ్ ల పరిచయం ఒహియోలోని పునరావాస కేంద్రంలో జరిగింది. ఆ పరిచయం ప్రేమగా మారి వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కాలేబ్ బరువు 217 కిలోలు. అయితే పెళ్లి తర్వాత కాలేబ్ బరువును అదుపులో పెట్టుకునే విధంగా ఆహార నియమాలను అనుసరించడం లేదని టామీ బాధపడింది. అటువంటి పరిస్థితిలో.. తన భర్త కాలేబ్‌ను జాగ్రత్తగా చూసుకోవాలి.

Tammy Slaton: 300 కిలోల బరువున్న భార్య.. తన భర్త 14 కేజీలు బరువు పెరిగాడని విడాకులు.. మరొకరితో డేటింగ్..
Tammy Slaton

Updated on: May 19, 2023 | 12:38 PM

ఒకప్పుడు భార్యభర్తల బంధం నిలబెట్టుకోవడానికి నిరంతరం ఆలోచించేవారు.. ఒకరినొకరు గౌరవించుకుంటూ..  ప్రేమిస్తూ జీవించేవారు. ఎటువంటి వివాదాలు ఏర్పడినా తొందరపడి విడాకులు తీసుకోవాలని ఆలోచించేవారు కారు. అయితే మారుతున్న కాలంతో పాటు.. సంబంధాల్లో కూడా వేగవంతంగా మార్పులు వచ్చాయి. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య బంధం బలహీన పడడానికి ప్రధానమైన కారణం నమ్మకం లోపించడం.. విశ్వాసం పదే పదే దెబ్బతినడం వల్ల మనం ఇప్పుడు విడిపోవచ్చు’ అని భార్యాభర్తలు అనుకుని వివాహ బంధానికి విడాకులతో గుడ్ బై చెప్పేస్తున్నారు. అయితే ఓ మహిళ తన భర్త బరువు 14 కిలోలు పెరిగాడన్న కారణంతో విడాకులు తీసుకుంది.  ఎవరైనా సరే ఈ వార్త చదివితే షాక్ అవుతారు.

రియాలిటీ టీవీ స్టార్ టామీ స్లాటన్ తన సోదరి అమీ స్లాటన్-హాల్టర్‌మాన్‌తో కలిసి ‘1,000-lb సిస్టర్స్’ అనే టీవీ షోలో నటించడంతో పాపులర్ అయింది. టామీ బరువు 300 కిలోల కంటే ఎక్కువ. పెళ్లి చేసుకున్న ఒక్క సంవత్సరం కూడా గడవక ముందే… టామీ తన భర్తకు విడాకులు ఇచ్చింది. దీనికి టామీ చెప్పిన రీజన్ వింటే షాక్ తింటారు. ఎందుకంటే భర్త 14 కిలోల బరువు పెరిగిందని తన భర్తకు విడకులు ఇచ్చింది. టామీ స్లాటన్ నవంబర్ 2022లో కాలేబ్ విల్లింగ్‌హామ్‌ను వివాహం చేసుకుంది. అప్పుడు ఆమె బరువు 317 కిలోలు. మరి స్థూలకాయంతో బాధపడే స్త్రీ..  బరువు పెరిగాడంటూ భర్తకు ఎలా విడాకులు ఇచ్చిందంటూ షాక్ తింటున్నారు.

ఇవి కూడా చదవండి

వాస్తవానికి టామీ, కాలేబ్ ల పరిచయం ఒహియోలోని పునరావాస కేంద్రంలో జరిగింది. ఆ పరిచయం ప్రేమగా మారి వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కాలేబ్ బరువు 217 కిలోలు. అయితే పెళ్లి తర్వాత కాలేబ్ బరువును అదుపులో పెట్టుకునే విధంగా ఆహార నియమాలను అనుసరించడం లేదని టామీ బాధపడింది. అటువంటి పరిస్థితిలో.. తన భర్త కాలేబ్‌ను జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే తనను తాను చూసుకోలేని టామీ తన భర్తను ఎలా చూసుకోగలను అని ఆలోచించింది. అయితే కాలేబ్ తన భార్యకు విడాకులు ఇవ్వాలని కోరుకోలేదు.. కానీ టామీ ససేమిరా అని తన భర్తకు విడాకులిచ్చింది.

మరోవైపు టామీ కూడా తన బరువు తగ్గించుకోవడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న టామీ తన బరువుని తగ్గించుకోవడానికి శస్త్రచికిత్స చేయించుకోవాలని భావిస్తోంది. ఈ ఆపరేషన్ తర్వాత టామీ 550 పౌండ్లకు (సుమారు 250 కిలోలు) చేరుకోవాలని భావిస్తోంది.

ది సన్ నివేదిక ప్రకారం.. టామీ భర్తకు విడాకులు ఇవ్వడమే కాదు.. మరో కొత్త జీవిత భాగస్వామిని వెదుక్కుంది. 25 ఏళ్ల టిక్‌టోకర్ గ్రెగ్ మోర్గాన్‌ తనకు డేటింగ్ యాప్‌ ద్వారా పరిచయం ఏర్పడిందని.. ఇప్పుడు అతనితో డేటింగ్ లో ఉన్నట్లు టామీ చెప్పింది. గ్రెగ్ ఇప్పటికే తన కుటుంబాన్ని కూడా కలుసుకున్నాడని వెల్లడించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..