Russian President Vladimir Putin: ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు వ్లాదమిర్ పుతిన్ (Vladimir Putin). ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్న ఆయన పేరే వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు కొంతమంది రాజకీయ విశ్లేషకులు, భద్రతా నిపుణులు, కొంతవరకూ సమాజంలో చదువుకున్న వారికి మాత్రమే పుతిన్ అనే పేరు తెలుసు.. కానీ ఇప్పుడు ఉక్రెయిన్‌పై ఏకపక్షంగా దాడికి దిగిన పుతిన్ పేరు గానీ రూపం కాని తెలియని వారుండరు. ఉక్రెయిన్ పాలనను స్వాధీనం చేసుకునేంత వరకు వెనకడుగు వేయొద్దంటూ సైన్యానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాలు ఉక్రెయిన్‌పై యుద్దం వద్దంటూ వారిస్తున్నా.. నాటో, ఐక్యరాజ్య సమితి సంయమనం పాటించాలని సూచిస్తున్నా.. యూరోపియన్ యూనియన్ హెచ్చరిస్తున్నా.. తగ్గదే లేదంటూ ఉక్రేయిన్‌పై బాంబుల వర్షం కురిపించాలని సైన్యానికి ఆదేశాలిచ్చారు. దీంతో రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై భీకర దాడులు జరుపుతోంది.
ఈ క్రమంలో వ్లాదమిర్ పుతిన్‌పై వ్యవహార శైలిపై ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చ కొనసాగుతోంది. తాజాగా ఆయన నడక, చేతి కదలికలో తేడా ఎందుకు ఉందంటూ చర్చజరుగుతోంది. పుతిన్ నడక మామూలుగా మనం నడిచే నడకకి భిన్నంగా ఉంటుంది. దీనికి కొందరు ఫ్యాషన్ ఎక్స్‌పర్ట్స్ దీన్ని “ఆల్ఫా మేల్ స్టైల్” అంటూ పేరు పెట్టారు. ఇందులో ముఖ్యంగా నడిచేటప్పుడు ఎడమచేతిని మాత్రమే కదిలిస్తూ ఉండగా కుడిచేయి మాత్రం కొంచెం కూడా కదలకుండా స్టిఫ్‌గా ఉంటుంది. అయితే పుతిన్ వ్యవహారశైలీ అచ్చం ఇలానే ఉంటుంది. అసలు పుతిన్ ఎందుకిలా నడుస్తారని చాలామందికి అనుమానం ఉంటుంది.
వాస్తవానికి పుతిన్ నిజానికి మొదట రష్యాకి చెందిన కేజీబీ గూఢాచారి. జర్మనీతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో పుతిన్ తన రహస్య కార్యకలాపాలు నిర్వహించారు. తర్వాత క్రమక్రమంగా రాజకీయాల్లోకి వచ్చి రష్యాకి తిరుగులేని నేతగా చలామణి అవుతున్నారు. మామూలుగా గూఢచారులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. తమ ఆయుధ శిక్షణలో భాగంగా తన కుడి చేయి వెపన్‌కి దగ్గరగా ఉండడం ద్వారా శత్రువుల దాడిని క్షణాల్లో ఎదుర్కొనే విధంగా వారికి శిక్షణ ఇస్తారు. అందుకే పుతిన్ ఇప్పటికీ తన నడకలో కుడిచేతిని ఏమాత్రం కదిలించరని పేర్కొంటున్నారు రక్షణ రంగ నిపుణులు. అందుకే పుతిన్ స్టైల్ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ.. ఇదే విధంగా ఉంటుందని పేర్కొంటున్నారు.
Also Read: