Covid-19: కరోనా కన్నా ప్రాణాంతకమైన వ్యాధి ముందుంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన చీఫ్ డబ్ల్యూహెచ్‌ఓ

కరోనా ప్రపంచాన్ని దేశాలను వణికించి సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే కోలకుంటున్న అన్ని దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. రాబోయే రోజుల్లో కరోనా కంటే ప్రాణాంతక మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలు సిద్ధంగా ఉండాలని కోరింది.

Covid-19: కరోనా కన్నా ప్రాణాంతకమైన వ్యాధి ముందుంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన చీఫ్ డబ్ల్యూహెచ్‌ఓ
Who Chief Tedros Adhanom Ghebreyesus

Updated on: May 25, 2023 | 4:13 AM

కరోనా ప్రపంచాన్ని దేశాలను వణికించి సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే కోలకుంటున్న అన్ని దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. రాబోయే రోజుల్లో కరోనా కంటే ప్రాణాంతక మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలు సిద్ధంగా ఉండాలని కోరింది. తదుపరి వచ్చే మహమ్మారి కొవిడ్‌-19 కంటే మరింత ప్రాణాంతకంగా ఉండవచ్చని తెలిపింది. మూడేళ్లనుంచి ప్రపంచాన్ని అతలాకుతం చేసిన కరోనా మహిమ్మారి వల్ల ఇప్పటివరకు సుమారు 70లక్షల మరణాలు నమోదయ్యాయి. అయితే ఇవి కేవలం అధికారిక లెక్కలు మాత్రమే. ఇంకా అనధికారికంగా ఎంతోమంది చనిపోయనట్లు అందిరికి తెలిసిన విషయమే.

అయితే కొవిడ్‌-19 ప్రపంచ అత్యయిక ఆరోగ్యస్థితి కాదని ప్రకటించినప్పటికీ ఆ మహమ్మారి ఇంకా ముగిసిపోలేదు. వ్యాధి వ్యాపించేందుకు కారణమయ్యే మరో వేరియంట్‌ రావచ్చు. మరణాలు కూడా సంభవించవచ్చు. మరింత ప్రాణాంతకమైన వైరస్‌ ఉద్భవించే ముప్పు ఉంది’ అని 76వ ప్రపంచ ఆరోగ్య సమావేశంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ పేర్కొన్నారు. అయితే తదుపరి మహమ్మారిని నిర్మూలించేందుకు తీసుకోవాల్సిన చర్యలను చర్చించేందుకు ఇదే సరైన సమయమన్నారు. ప్రజారోగ్యానికి తొమ్మిది వ్యాధులు అత్యంత ప్రమాదకరంగా మారాయన్న ఆయన. చికిత్స లేకపోవడం లేదా మహమ్మారికి దారితీసే సామర్థ్యం కలిగి ఉండటం వల్ల ఇవి ప్రమాదకరమైనవిగా మారినట్టు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం