ఈ అణుబాంబుల(nuclear ) వల్ల ఓ దేశం ఎంత కోల్పోయిందో అందరికీ తెలుసు. రెండో ప్రపంచ యుద్ధంలో(second world war) అమెరికా(USA) వదిలిన అటామిక్ బాంబుల వల్ల జపాన్‌లో 2లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. హిరోషిమా, నాగసాకి అణుఘటనల నుంచి ఇప్పటికీ ప్రపంచం కోలుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో పుతిన్ న్యూక్లియర్ వార్‌హెడ్స్‌ని సిద్ధం చేస్తుండడం షాకింగే. పుతిన్‌లో నియంత ఉన్నాడని అందరికీ తెలుసు. కాని అది మరో లెవెల్‌కి వెళ్తోందని ఆయన చేష్టలే చెబుతున్నాయి. రష్యాదగ్గరున్న మరో బిగ్గెస్ట్ వెపన్ FOAB. ఫోయాబ్ అంటే.. ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్. ఇది అమెరికా అమ్ములపొదిలో ఉన్న మదర్ ఆఫ్ ఆల్‌బాంబ్స్‌కి అప్‌గ్రేడ్ వర్షన్. ఇది న్యూక్లియర్ వెపన్ కాదుగాని.. అంతకన్నా దారుణమైంది. ఇది విడుదల చేసే శక్తి వల్ల ఓ ఊరు ఊరంతా సర్వనాశనం అవుతుంది.
భూమిని తాకిన ప్రదేశం నుంచి 300 మీటర్ల రేడియస్ వరకు బిల్డింగులు, చెట్టూ పుట్టలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. కిలోమీటర్ వరకు కట్టడాలు దెబ్బతింటాయి. పది కిలోమీటర్ల వరకు జనాల ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. కారణం ఈ బాంబు వల్ల ఏర్పడే శూన్యత. వ్యాక్యూమ్.
1961లో రష్యా అతి రహస్యంగా అణుపరీక్షలు జరిపింది. తనదగ్గరున్న ఈ అణుబాంబు ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైనదే కాదు.. అత్యంత శక్తివంతమైనది కూడా. అదే సమయంలో హైడ్రోజన్ బాంబైన TSAR కూడా రష్యన్ అమ్ములపొదిలో ఉంది. ఇది గనుక ఏదైనా మెట్రో నగరం మీద పడితే.. ఉదాహరణకు మన హైదరాబాద్ మీదే పడితే.. కోటి మంది అక్కడికక్కడే ప్రాణాలు వదులుతారు. మిగిలిన వారు జీవితాంతం అంధులుగా, బధిరులుగా బతకాల్సిందే. అలాంటి Tsar Bomb రష్యా సొంతం.
ఇవి కూడా చదవండి: Pregnancy Tips: ప్రెగ్నెన్సీ సమయంలో ఉద్యోగం చేస్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి