Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో అమాయక పౌరులపై రష్యా సేనలు దాడి చేస్తున్నట్లు ఆ దేశం ఆరోపిస్తోంది. అయితే రష్యా ప్రభుత్వం ఈ ఆరోపణలను మొదటి నుంచీ తోసిపుచ్చుతోంది. ఇదే అంశాన్ని ఐక్యరాజ్య సమితి(ఐరాస) సర్వ సభ్య అత్యవసర సమావేశంలోనూ ఉక్రెయిన్ లేవనెత్తింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ఐక్య రాజ్యసమితి అత్యవసర జనరల్ అసెంబ్లీ నిర్వహించగా.. ఐరాసలో ఉక్రెయిన్ ప్రతినిధి దీనికి సంబంధించి ఆధారాలను చదివి వినిపించారు. తాము ఉక్రెయిన్‌లోని అమాయక ప్రజలను కూడా టార్గెట్ చేస్తున్నట్లు రష్యాకు చెందిన ఓ సైనికుడు ఉక్రెయిన్‌లోని తన తల్లికి మొబైల్ ఫోన్‌లో పంపిన మెసేజ్ ఇది. యుద్ధంలో మరణించడానికి కొన్ని క్షణాలకు ముందుగా ఆ సైనికుడు ఈ మెసేజ్ చేసినట్లు.. సదరు స్క్రీన్ షాట్స్‌ను చూపారు. ఉద్దేశపూర్వకంగా రష్యా సేనలు ఉక్రెయిన్‌లో అమాయక పౌరులపై దాడులు చేసి హతమార్చుతున్నట్లు ఉక్రెయిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఆపేందుకు, రష్యా తన సేనలను ఉపసంహరించుకునేందుకు అంతర్జాతీయ సమాజం రష్యాపై ఒత్తిడి తీసుకురాలని ఐరాసలో ఉక్రెయిన్ ప్రతినిధి కోరారు.
Ukraine’s Ambassador to the UN read out text messages between a Russian soldier and his mother moments before he was killed. He read them in Russian.
“Mama, I’m in Ukraine. There is a real war raging here. I’m afraid. We are bombing all of the cities…even targeting civilians.” pic.twitter.com/mLmLVLpjCO
— Vera Bergengruen (@VeraMBergen) February 28, 2022
Also Read..
Ukraine Crisis: ఉక్రెయిన్‌పై ఆరో రోజూ కొనసాగుతున్న రష్యా దాడులు.. 70 మంది ఉక్రెయిన్ సైనికులు మృతి