Viral Video: పొగమంచు విధ్వంసం.. ఏకంగా 200 కార్లు వరుసగా ఢీ! ఒకరు మృతి.. అనేక మందికి తీవ్రగాయాలు

|

Dec 28, 2022 | 6:10 PM

చైనాలో బుధవారం (డిసెంబర్‌ 28) ఘోర ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా 200ల కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో అనేక మందికి గాయలయ్యాయి. అందిన సమాచారం మేరకు.. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని జెంగ్‌జువా నగరంలోని ఓ బ్రిడ్జిపై..

Viral Video: పొగమంచు విధ్వంసం.. ఏకంగా 200 కార్లు వరుసగా ఢీ! ఒకరు మృతి.. అనేక మందికి తీవ్రగాయాలు
Over 200 vehicles Crash in china
Follow us on

చైనాలో బుధవారం (డిసెంబర్‌ 28) ఘోర ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా 200ల కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో అనేక మందికి గాయలయ్యాయి. అందిన సమాచారం మేరకు.. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని జెంగ్‌జువా నగరంలోని ఓ బ్రిడ్జిపై దట్టమైన పొగమంచు కారణంగా భారీ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న 200ల వాహనాలు వెనుక నుంచి ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. అనేక మందికి గాయాలైనట్లు, వారందరినీ ఆసుపత్రికి తరలించినట్లు చైనా మీడియా సంస్థలు వెల్లడించాయి. అగ్నిమాపక యంత్రాల ద్వారా సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ పుటేజీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైలర్‌ అవుతోంది. కార్లు, ట్రక్కులు ఒకదాన్ని ఒకటి ఢీకొట్టుకుని బ్రిడ్జిపై అస్తవ్యస్తంగా పడి ఉండటం ఈ వీడియో కనిపిస్తుంది.

కాగా చైనాలో గత కొన్ని రోజులుగా దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీంతో వాహనదారులకు రోడ్డు కనిపించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం కూడా దట్టమైన పొగమంచు కప్పేయడంతో ముందున్న వాహనాలు కనిపించక వందల వాహనాలు వెనుక వైపు నుంచి ఢీకొట్టుకున్నాయి. దాదాపు11 అగ్నిమాపక వాహనాలు, 66 మంది అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.