Grand Canyon: అభివృద్ధికి ఆమడ దూరంలో అమెరికాలోని ఓ గ్రామం.. ఇప్పటికీ గాడిదలపైనే ప్రయాణం
Grand Canyon Village: ఆధునిక యుగంలో టెక్నాలజీతో సృష్టికి ప్రతి సృష్టి చేసే దిశగా మనిషి పయనిస్తున్నాడు. అంబరాన్ని అందుకుంటున్నాడు. సముద్ర లోతులను కొలుస్తున్నాడు..
Grand Canyon Village: ఆధునిక యుగంలో టెక్నాలజీతో సృష్టికి ప్రతి సృష్టి చేసే దిశగా మనిషి పయనిస్తున్నాడు. అంబరాన్ని అందుకుంటున్నాడు. సముద్ర లోతులను కొలుస్తున్నాడు. అయితే టెక్నాలజీ అనగానే ముందుగా గుర్తుకొచ్చే దేశం అగ్రరాజ్యం అమెరికా. ఒక్క మాటలో చెప్పాలంటే అభివృద్ధికి మారుపేరు అమెరికా. అలాంటి అమెరికాలో కూడా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయంటే నమ్మశక్యంగా లేదు కదా.. అవును.. అమెరికాలో అసలు అభివృద్ధి అంటే ఏమిటో కూడా తెలియని ఓ గ్రామం ఉంది. అయితే ఆ గ్రామం ఎందుకు అలా వెనుకబడి ఉందో వివరాల్లోకి వెళ్తే..
అమెరికాలో గ్రాండ్ కాన్యన్ అనే లోతైన లోయ ఒకటుంది. అది చాలా ఫేమస్. ప్రతీ ఏట దాదాపుగా 55 లక్షల మంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు కూడా. దీనికి సమీపంలోనే సుపాయ్ అనే గ్రామం ఉంది. అమెరికా భూమట్టానికి దాదాపుగా మూడు వేల అడుగుల లోతులో ఉందీ గ్రామం. ఇక్కడ దాదాపు 208 మంది అమెరికన్ స్థానికులు నివసిస్తున్నారు. అతిలోతైన భూగర్భ గ్రామంగా ఇది ప్రసిద్ధిచెందింది. ఇక్కడ నివసించే ప్రజల జీవన శైలి ప్రపంచానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వీరు ప్రత్యేకమైన భాష, ఆచారవ్యవహారాలు కలిగి ఉంటారు. వీరు హవాసుపాయి అనే భాషలో మాట్లాడుతారు. ఈ గ్రామానికి వెళ్లాలంటే కాలినడకన వెళ్లాల్సిందే. ఎందుకంటే అక్కడికి వెళ్లడానికి ఎలాంటి వాహన సౌకర్యాలు లేవు.. కనీసం రోడ్డు మార్గం కూడా లేదు. అందుకే ఇక్కడి ప్రజలు ఇప్పటికీ గాడిదలపైనే ప్రయాణిస్తారు. చాలా అరుదుగా గుర్రాలను వినియోగిస్తారట.
ఇక టెక్నాలజీకి పూర్తిగా దూరం ఈ గ్రామం. ఐతే ఇక్కడ కొన్ని పోస్టాఫీసులు, కేఫ్‌లు, రెండు చర్చిలు, లాడ్జీలు, ప్రాథమిక పాఠశాలలు, కిరాణా దుకాణాలు ఉన్నాయి. కనీసం టెలిఫోన్ అంటే ఏమిటో కూడా తెలియదు ఇక్కడి ప్రజలకు. ఇప్పటికీ ఉత్తరాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రోడ్డు సదుపాయం లేకపోవడంతో అవికూడా సమయానికి అందవు. వెదురుతో బుట్టలను అల్లి సమీపంలోని నగరాల్లో అమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. చిక్కుడు, మొక్కజొన్నలను సాగు చేసి పొట్టపోసుకుంటారు. అమెరికా లాంటి దేశంలో ఇంత వెనుకబడిన గ్రామం ఉండడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంతేకాదు ఈ గ్రామానికి పొదలతో నిండిన అడవులను దాటుకుంటూ వెళ్లవలసి ఉంటుంది. ఈ గ్రామంలోకి ప్రవేశించేముందు హవాసుపాయి గిరిజన మండలి అనుమతి తప్పక తీసుకోవాలి. లేదంటే లోపలికి రానివ్వరు. గ్రామంలో ప్రవేశించిన తర్వాత వారి నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలట. ఆధునిక యుగంలో అమెరికాలాంటి దేశంలో అభివృద్ధి కన్నే ఎరుగని సుపాయి గ్రామం ఇలా పూర్తిగా వెనుకబడి ఉండటం వెనక కారణం ఏమై ఉంటుందో… అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.
Also read: హెక్టారు అల్లం పంటతో సుమారు రూ. 15 లక్షలు లాభం.. పూర్తి వివరాలు మీకోసం..