సెలవు రోజు సరదాగా గడుపుదామని వెళ్లిన కొందరు ఊహించని విధంగా ప్రమాదంలో పడ్డారు. హాట్ ఎయిర్ బెలూన్‌కి మంటలు అంటుకొని ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో 39 ఏళ్ల మహిళ, 50 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. చిన్నారి సహా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మెక్సికో సిటీకి ఈశాన్యంగా 45 మైళ్ల దూరంలో ఉన్న టియోటిహుకాన్‌కు సుదూర ప్రాంతాలనుంచి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ చాలా ఫేమస్. దాంతో చాలామంది సరదాగా ఆకాశంలో విహరించాలని కోరుకుంటారు. అలా అక్కడికి పర్యటనకు వెళ్లిన కొందరు ఈ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్‌కు వెళ్లారు.
బెలూన్ గాల్లోకి లేచిన కొద్దిసేపటికి మంటలు అంటుకున్నాయి. దాంతో బెలూన్‌లో ఉన్నవారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వారిలో ఇద్దరు ప్రాణ భయంతో కిందకు దూకేశారు. చాలా ఎత్తునుంచి దూకేయడంతో వారు స్పాట్‌లోనే చనిపోయారు. మంటల్లో కాలిపోయిన బెలూన్ కాసేపటకి నేలమీద పడింది. అందులో ఉన్న మరో ముగ్గురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన మొత్తం అక్కడున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో నెట్టింట విజువల్స్ వైరల్ అవుతున్నాయి. టియోటిహుకాన్ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇది కొలంబియన్ పూర్వ కాలం నాటి స్మారక చిహ్నం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..