పారిస్, డిసెంబర్ 25: ఫ్రాన్స్‌లోని ప్రపంచ ప్రఖ్యాత కట్టడం ఈఫిల్ టవర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిత్యం ఎందరో టూరిస్టులు ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. జనాల తాకిడి అధికంగా ఉండే ఈఫిల్ టవర్‌లో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగసి పడటంతో పర్యాటకులంతా భయాందోళనలకు గురయ్యారు.
హుటాహుటీన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు 1200 మందిని ఆ ప్రదేశం నుంచి ఖాళీ చేయించారు. ఈఫిల్ టవర్ మొదటి, రెండో అంతస్తుల మధ్యలోని లిఫ్ట్ షాఫ్ట్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే అక్కడికి చేరుకున్న అత్యవసర బృందాలు అక్కడి నుంచి సందర్శకులను ఖాళీ చేయించి మంటలను అదుపుచేశారు. మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఎలివేటర్ కేబుల్స్ వేడెక్కడం వల్ల మంటలు చెలరేగాయి. ఎమర్జెన్సీ సెబ్బంది కాసేపటికే మంటలను అదుపులోకి వచ్చినట్లు యూరోన్యూస్ వర్గాలు తెలిపాయి.
🚨 BREAKING: More than 1,200 people are evacuated from the Eiffel Tower due to a fire. Reports indicate that the fire is due to the overheating of one of the elevator cables.
🔸 The news of the evacuation came just a couple of hours after a major fire broke out in a building… https://t.co/N2PZLU85nf pic.twitter.com/o5kQ7Ul060
— Pvt. Sakarium 𐱅𐰇𐰼𐰰🇹🇷 🇦🇿 (@PvtSakarium) December 24, 2024
అగ్నిప్రమాదం నేపథ్యంలో ఈఫిల్ టవర్‌ను తాత్కాలికంగా మూసివేసి మెయింటెనెన్స్ పనులు చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. ఎవరికీ ఎలాంటి గాయాలు అయినట్లు సమాచారం లేదు. కాగా ప్రపంచ ప్రఖ్యాత టూరిస్ట్ ప్లేస్‌గా పేరుగాంచిన ఈషిల్ టవర్‌ను నిత్యం సగటున 15 వేల నుంచి 25 వరకు టూరిస్టులు సందర్శిస్తున్నారు.