భూమి మీద స్మశానం ఆక్రమణలకు గురి అవుతున్న సంఘటనలు అనేకం వింటూనే ఉన్నాం.. అయితే ఇప్పుడు అంతరిక్షంలో స్మశానాన్ని కనుగొన్నారు సైటింస్టులు… అంతరిక్షంలో స్మశానమేంటని అనుకుంటున్నారా… ఇది నిజం. కానీ అది మనుషులకు సంబంధించిన స్మశానం కాదు.. నక్షత్రాలకి సంబంధించినది. అప్పుడప్పుడూ ఆకాశంలోనుంచి నక్షత్రాలు రాలి కిందపడటం మనం చూస్తుంటాం. అలా కాలం తీరి మృతప్రాయంగా మారి రాలిపడిపోయిన పురాతన నక్షత్రాలతో కూడిన మరుభూమిలాంటి ప్రదేశాన్ని పాలపుంతలో ఓ మూలన గుర్తించారు వ్యోమగాములు. మన పాలపుంత వైశాల్యాన్ని మథిస్తున్న క్రమంలో స్మశానాన్ని తలపించే ఈ ప్రాంతం వారికి కనిపించిందట. పదులు వందలూ కాదు, లెక్కలేనన్ని సంఖ్యలో మృత నక్షత్రాలు అక్కడ పడి ఉన్నాయట. ఇవన్నీ ఒక్కొక్కటిగా బ్లాక్‌హోల్స్‌లోకి అంతర్ధానమవుతున్నాయట.
అంతరిక్షంలో దీన్ని ఒకరకంగా అధోజగత్తుగా చెప్పవచ్చని సైంటిస్టులు అంటున్నారు. దీని ఎత్తు పాలపుంతతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా ఉందట. పాలపుంతలోని ద్రవ్యరాశిలో ఇవే కనీసం మూడో వంతు ఉంటాయని సైంటిస్టులు అంటున్నారు.
అంతరిక్షంలో స్మశానం:
Explore the galactic underworld this #WorldSpaceWeek ?@Sydney_Uni PhD student David Sweeney & his team have developed the first map of the ‘galactic underworld’.
? https://t.co/aMt9pDgV0Z#LeadershipInAction #USYD pic.twitter.com/3S6XKsky5v
— University of Sydney (@Sydney_Uni) October 7, 2022
ఈ మృత నక్షత్రాలన్నీ చాలా పురాతనమైనవని, ఎప్పుడో మన పాలపుంత పాలబుగ్గల ప్రాయంలో ఉన్నప్పుడు ఏర్పడ్డ బాపతని నాసా తెలిపింది. మారుమూల చీకట్లలో దాగుండటం వల్ల ఇంతకాలం కంటపడలేదని చెప్పుకొచ్చింది. అన్నట్టూ, ఈ అధోజగత్తు తాలూకు ఒక కొస మనకు 65 కాంతి సంవత్సరాల కంటే దూరం ఉండదట!
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..