పాకిస్తాన్‌కు బలూచ్ షాక్.. చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఆ ఒక్క లేఖ! ఏంటో తెలుసా?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక్క లెటర్ ఇప్పుడు.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఆ ఒక్క లెటరే ఇప్పుడు పాకిస్థాన్, చైనా దేశాలను తీవ్ర కలవరానికి గురిచేస్తుంది. ఇంతకూ ఏంటా లెటర్.. చైనా, పాకిస్తాన్ భయపడేంతలా.. ఆ లెటర్‌లో ఏముందో తెలుసుకోవాలంటే ఈ స్టోరి చదవాల్సిందే.

పాకిస్తాన్‌కు బలూచ్ షాక్.. చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఆ ఒక్క లేఖ! ఏంటో తెలుసా?
Republic Of Balochistan Letter

Updated on: Jul 16, 2026 | 9:45 AM

రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్’ పేరుతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక లేఖ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. బలూచిస్తాన్ వేర్పాటువాదులు పాకిస్తాన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నట్టు, ఆ ప్రాంతంలోని మెజారిటీ భాగం తమ ఆధీనంలోనే ఉన్నట్టు ఆ లేఖలో ఉంది. అయితే ఈ ప్రకటనకు సంబంధించి ఎలాంటి అధికారిక దృవీకరణ లేనప్పటికీ.. ఇది పాకిస్తాన్‌తో పాటు అటు చైనాలోనూ తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఎందుకంటే చైనా బలూచిస్తాన్‌లో బిలియన్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది.

బలూచిస్తాన్‌ పాక్‌కు ఎందుకు అంత కీలకం?

భౌగోళికంగా బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్‌లోనే అతిపెద్ద ప్రావిన్స్. ఈ ఒక్క బూచిస్తాన్ మాత్రమే దేశ మొత్తం భూభాగంలో దాదాపు 44 శాతం కలిగి ఉంది. అయితే, ఇది విస్తీర్ణంలో పెద్దదైనప్పటికీ, ఇక్కడ జనాభా మాత్రం చాలా తక్కువ, అలాగే అభివృద్ధిలోనూ ఈ ప్రాంతం చాలా వెనబడి ఉంది. కానీ ఈ ప్రాంతం రాగి, బంగారం, సహజ వాయువు, బొగ్గు వంటి సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. అరేబియా సముద్ర తీరంలో ఉన్న దీని వ్యూహాత్మక స్థానం దక్షిణాసియా, మధ్య ఆసియా, మధ్యప్రాచ్య దేశాలను అనుసంధానించే కీలక ద్వారంగా పనిచేస్తుంది.

అయితే, కేంద్ర ప్రభుత్వం తమ వనరులను దోచుకుంటూ, స్థానిక ప్రజల అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని గత కొన్ని దశాబ్దాలుగా బలూచ్ జాతీయవాద గ్రూపులు ఆరోపిస్తున్నాయి. అందుకే తామరు పాకిస్తాన్ నుంచి ఏర్పాటు అయి స్వేచ్ఛగా బతకాలిని కోరుకుంటున్నారు. అక్కడ వేర్పాటువాద ఉద్యమానికి కూడా ఇదే అసలు కారణం.

మరీ బలూచిస్తాన్‌పై చైనాకు ఎందుకంత ఆసక్తి?

పాకిస్తాన్‌లో ఉన్న బలూచిస్తాన్‌ చైనాకు ఎందుకంత కీలకం అంటే.. చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో భాగమైన చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ప్రాజెక్టుకు బలూచిస్తాన్‌లోనే ఉంది. దాదాపు 65 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఈ ప్రాజెక్ట్ ద్వారా పశ్చిమ చైనాను హైవేలు, రైల్వేలు, ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా అరేబియా సముద్రంతో అనుసంధానించాలని బీజింగ్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే మలక్కా జలసంధిపై గుండా కాకుండా అంతర్జాతీయ నౌకా రవాణా మార్గాలకు నేరుగా చేరుకోవడానికి చైనాకు బలూచిస్తాన్ రూట్ చాలా అవసరం అవుతుంది. అందుకే చైనాకు బలూచిస్తాన్ కూడా చాలా కీలకంగా మారింది.

చైనా కలల ప్రాజెక్టు అయిన గ్యాదర్ పోర్టు కూడా ఈ బలూచిస్తాన్ తీరంలోనే ఉంది. ఈ పోర్టు చైనా పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ పోర్టును అంతర్జాతీయ వాణిజ్య హబ్‌గా మార్చేందుకు చైనా దీనిపై భారీ మొత్తంలో పెట్టుబడుతు పెట్టి ఈస్ట్‌బే ఎక్స్‌ప్రెస్‌వే, నూతన రోడ్ల నెట్‌వర్క్, భారీ విద్యుత్ ప్రాజెక్టులు ,న్యూ గ్వాదర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వంటి కీలక మౌలిక సదుపాయాలను చైనా అభివృద్ధి చేసింది.

ఖనిజ సంపదపై కన్ను

అయితే కేవలం అక్కడి ప్రాంతాన్ని వాడుకోవడామే కాకుండా.. అక్కడున్న ఖనిజ సంపదపై కూడా చైనా కన్నేసింది. ఇందులో భాగంగానే చాఘీ జిల్లాలోని ప్రసిద్ధ సైందక్ కాపర్-గోల్డ్ అనే ప్రాజెక్టును చైనాకు చెందిన మెటలర్జికల్ కార్పొరేషన్ అనే సంస్థ కొన్ని ఏళ్లుగా రన్ చేస్తోంది. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్, క్లీన్-ఎనర్జీ టెక్నాలజీకి అవసరమైన కీలక ఖనిజాల కోసం మరిన్ని మైనింగ్ ప్రాజెక్టులను చేజిక్కించుకునేందుకు కూడా చైనా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

చైనా ప్రాజెక్టులకు భద్రత ముప్పు

అయితే బలూచిస్తాన్‌లో చైనా ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినప్పటికీ, వారి ప్రాజెక్టులకు ఇక్కడ భద్రతా ముప్పు లేకపోలేదు. ఎందుకంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) సహా అనేక వేర్పాటువాద గ్రూపులు.. తమ ప్రాంతంలో చైనా జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. స్థానిక ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కల్పించకుండా.. ఇస్లామాబాద్‌తో కలిసి చైనా తమ వనరులను అక్రమంగా దోచుకుంటుదని వారు ఆరోపిస్తున్నారు.

ఒకవేళ బలూచిస్తాన్ స్వతంత్రమైతే చైనా పరిస్థితి ఏమిటి?

అయితే బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా మారడం ప్రస్తుతం సాధ్యం కాకపోయినా.. చైనాకు మాత్రం బలూచ్ ఏర్పాటు వాదుల నుంచి ముప్ప మాత్రం తప్పదు. ఒకవేళ బలూచిస్తాన్‌కు స్వయంప్రతిపత్తి వచ్చినా లేదా పాక్‌లో వేరే ప్రభుత్వం ఏర్పడినా, చైనాతో కుదుర్చుకున్న పాత కాంట్రాక్ట్స్ మొత్తం రద్దయ్యే అవకాశం ఉంటుంది. ఇది చైనాకు భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఏదేమైనా, ప్రస్తుత వైరల్ లేఖ సృష్టించిన అలజడి పాకిస్తాన్ అంతర్గత భద్రతనే కాకుండా, చైనా ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కారిడార్ భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకంలో పడేసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us