Viral Video: వందేళ్ల నాటి గుడ్డు.. రుచిచూసిన మహిళ.. సోషల్ మీడియాలో వైరల్

మీరు గుడ్లు తింటారా..? అదేం ప్రశ్నం అంటున్నారా.. ఆగండాగండి. ఇప్పుడు చెప్పబోయే విషయం గురించి తెలిస్తే మీరు షాక్ అవడం పక్కా..

Viral Video: వందేళ్ల నాటి గుడ్డు.. రుచిచూసిన మహిళ.. సోషల్ మీడియాలో వైరల్
Century Egg

Edited By: Janardhan Veluru

Updated on: Feb 12, 2022 | 2:26 PM

Viral Video: మీరు గుడ్లు తింటారా..? అదేం ప్రశ్నం అంటున్నారా.. ఆగండాగండి. ఇప్పుడు చెప్పబోయే విషయం గురించి తెలిస్తే మీరు షాక్ అవడం పక్కా.. ఇంతకీ ఏంటో ఆ విషయం అంటున్నారా.. ? మనం సాధారణంగా షాప్ కు వెళ్లి గుడ్లు తెచ్చుకుంటాం. ఆ దుకాణంలో తాజా గుడ్లను మాత్రమే మనకు విక్రయిస్తారు. అలాంటి వాటినే మనం ఎక్కువగా కొంటాం. కానీ ఓ మహిళ చేసిన పని గురించి తెలిస్తే మీరు వామ్మో అంటారు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే… వంద సంవత్సరాల క్రితం నిల్వ ఉన్న గుడ్డును తిన్నది. అంతే కాకుండా దానికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళ రుచి చూసిన గుడ్డును సెంచరీ ఎగ్ అని నెటిజన్లు పిలుస్తున్నారు.

వందేళ్ల గుడ్డు కావడంతో అది మట్టి, బూడిద, ఉప్పు, సున్నం, ఇతర పదార్థాలతో చాలా కాలం పాటు నిల్వ ఉంది. థాయ్, లావో సంస్కృతిలో ముదురు గోధుమ రంగు గుడ్లు తినేందుకు ఇష్టపడతారు. ఈ గుడ్లు మట్టి, బూడిద, ఉప్పు లేదా సున్నం మరియు ఇతర పదార్థాలతో ఒక వారం లేదా ఒక నెల పాటు ఉంచబడతాయి. వాటిని తినడం అక్కడ సాధారణమైన విషయమే. కానీ వందేళ్లు నిల్వ ఉన్న గుడ్డును తినడమే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

వైరల్ వీడియో చూడండి..

Also Read

IPL 2022 Auction: వార్నర్‌ను దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఎంతకు అమ్ముడుపోయాడో తెలుసా.?

Assembly Election 2022: నేటితో ముగియనున్న 2వ దశ ఎన్నికల ప్రచారం.. ఫిబ్రవరి14న గోవా, ఉత్తరాఖండ్, యూపీలో పోలింగ్

100 కిలోమీటర్ల రేంజ్ ఉన్న మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?