
ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో జరిగిన అనూహ్య ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక శాఖాహారి ప్రయాణికుడికి మాంసాహారం వడ్డించారు. ఆ ఆహారం అతని గొంతులో ఇరుక్కుపోయి మరణించాడు. ఎయిర్‌లైన్ నిర్లక్ష్యం వల్లే 85 ఏళ్ల శాఖాహారి అశోక్ జయవీర మరణించాడని అతని కుటుంబం ఆరోపిస్తోంది. దీంతో కేసు నమోదు చేశారు.
కాలిఫోర్నియాకు చెందిన 85 ఏళ్ల కార్డియాలజిస్ట్ అశోక్ జయవీరకు అమెరికా నుండి శ్రీలంకకు ఖతార్ విమానంలో మాంసాహార భోజనం వడ్డించారని, తినడానికి ప్రయత్నిస్తుండగా ఆయన ఊపిరాడక చనిపోయారని మృతుడి కుటుంబం ఆరోపించింది. లాస్ ఏంజిల్స్ నుండి కొలంబోకు విమానంలో 85 ఏళ్ల వ్యక్తి ఊపిరాడక మరణించాడని ఆరోపణలు రావడంతో, ఖతార్ ఎయిర్‌వేస్‌పై అమెరికాలో కేసు నమోదు అయ్యింది.
దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన రిటైర్డ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అశోక జయవీర జూన్ 23న కొలంబోకు తన విమానాన్ని బుక్ చేసుకున్నాడు. ఒక వారం తర్వాత, అతను లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విమానం ఎక్కాడు. పూర్తి శాఖాహారుడైన జయవీర తన పదిహేనున్నర గంటల విమాన ప్రయాణానికి శాఖాహార భోజనాన్ని ఆర్డర్ చేశాడు. అయితే, ఖతార్ విమాన సహాయకురాలు అతనికి శాఖాహార భోజనం లేదని, అతనికి మాంసంతో కూడిన సాధారణ భోజనం ఇచ్చారు. కానీ విమానంలో అతనికి మాంసాహార భోజనం వడ్డించారు. అతను మాంసం తినడానికి ప్రయత్నించాడు. దానిలో ఒక ముక్క అతని గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక చనిపోయాడు.
జయవీర కుటుంబం దాఖలు చేసిన కొత్త దావాలో, విమానం ఆర్కిటిక్ సర్కిల్, ఆర్కిటిక్ మహాసముద్రం మీదుగా ఎగురుతున్నందున, ఆ సంఘటన సమయంలో విమానం పైలట్ అత్యవసర ల్యాండింగ్ చేయడానికి నిరాకరించారని తెలిపారు. అయితే, ఆ సమయంలో విమానం వాస్తవానికి అమెరికన్ మిడ్‌వెస్ట్ మీదుగా ఉందని, దానిని సులభంగా దారి మళ్లించవచ్చని జయవీర కుమారుడు సూర్య పేర్కొన్నారు. ఈ మేరకు జూలై 31న కాలిఫోర్నియా రాష్ట్ర కోర్టులో సూర్య పిటిషన్ దాఖలు చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..