Vaccination Dose: ఇప్పడు అంతా కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించిన విషయాలు.. కరోనా టీకాకు సంబంధించిన విశేషాలే రోజూ ఎటు చూసినా కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి. వాటిలో కొన్ని సానుకూలంగా ఉండేవి. కొన్ని భయపెట్టేవి.. మరికొన్ని ఆలోచింప చేసేవి ఉంటున్నాయి. ఇదిగో ఈ విశేషం ఏ కోవకి చెందుతుందో మీరే డిసైడ్ చేసుకోండి. కోవిడ్ విరుచుకుపడుతున్న వేళ వైద్య సిబ్బందిపై ఉన్న ఒత్తిడి అంతా, ఇంతా కాదు. ఈ ఒత్తిడిలో ఒక్కోసారి మానవ సహజమైన తప్పిదాలు జరిగిపోతూ వస్తున్నాయి. ఇటలీలో ఒక మహిళకు ఆరోగ్య కార్యకర్త ఒకరు టీకా వేసింది. మామూలుగా వ్యాక్సిన్ ఇస్తే చెప్పుకోవడానికి ఏమీ వుండదు. కానీ, ఆ ఆరోగ్య కార్యకర్త ఒకే టీకా ఆరుమోతాదులను ఒక్కసారిగా ఇచ్చింది. ఇది ఎలా జరిగింది అంటే..
ఒక ఆరోగ్య కార్యకర్త 23 ఏళ్ల ఇటాలియన్ మహిళకు ఫైజర్ బయోఎంటెక్ కోవిడ్ -19 వ్యాక్సిన్ ఆరు మోతాదులను పొరపాటుగా ఇచ్చారు. మధ్య ఇటలీలోని టుస్కానీలోని నోవా ఆసుపత్రిలో మహిళకు టీకా ఇచ్చారు. ఆ ఆరోగ్య కార్యకర్త అనుకోకుండా ఏమరపాటులో ఒక సిరెంజిలో ఒక టీకా బాటిల్ మొత్తం నింపేశారు. అందులో ఆరు మోతాదుల టీకా ఉంది. సిరెంజిలో నింపేసిన వెంటనే, ఆ వ్యాక్సిన్ మహిళకు ఇచ్చేశారు. ఆ తరువాత జరిగిన పొరపాటును గ్రహించారు. అయితే, అదృష్టవశాత్తూ ఆ టీకా తీసుకున్న మహిళకు ఎటువంటి దుష్ప్రభావాలూ ఏర్పడలేదు. ఆమెను 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచిన అనంతరం సోమవారం డిశ్చార్జి చేసి పంపించారు.
Vaccination Dose: ఇది పొరబాటున జరిగింది.కేవలం మానవ తప్పిదం మాత్రమే అని ఆసుపత్రి ప్రతినిధి డేనియెల్లా జియానెల్లి మీడియాకు చెప్పారు. అయితే, అంతర్గత విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఆరోగ్య సిబ్బంది మరియు ఫార్మసీ కార్మికులందరికీ వైద్య సిబ్బంది, రోగులు మరియు బలహీన ప్రజలను రక్షించడానికి టీకాలు వేయడం తప్పనిసరి చేస్తూ ఇటాలియన్ ప్రభుత్వం ఏప్రిల్‌లో ఒక ఉత్తర్వును ఆమోదించింది.
Also Read: Zombie Reddy: మళ్లీ భయపెట్టడానికి వస్తోన్న జాంబీలు..? కరోనా సెకండ్ వేవ్ ప్రేరణతో..