AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fireworks: రష్యాలో కనువిందు చేసిన బాణాసంచా విన్యాసాలు..వైరల్ అవుతున్న డ్రోన్ వీడియో..

Fireworks: పటాసులు ఎప్పుడు పేల్చినా చూడటానికి ముచ్చటగా ఉంటుంది. దీపావళి పండుగ కోసం ప్రజలు అంతగా ఎదురుచూసేది అందుకే.

Fireworks: రష్యాలో కనువిందు చేసిన బాణాసంచా విన్యాసాలు..వైరల్ అవుతున్న డ్రోన్ వీడియో..
Fireworks
KVD Varma
|

Updated on: May 11, 2021 | 9:52 PM

Share

Fireworks: పటాసులు ఎప్పుడు పేల్చినా చూడటానికి ముచ్చటగా ఉంటుంది. దీపావళి పండుగ కోసం ప్రజలు అంతగా ఎదురుచూసేది అందుకే. ఒక్క దీపావళి పండుగ అని కాదు.. ఏదైనా శుభకార్యాల సమయంలో ఆనందాన్ని ఆవిష్కరించడానికి బాణాసంచా కాల్చడం ప్రపంచమంతా ఉంది. కొత్తసంవత్సర వేడుకల్లో దాదాపుగా అన్ని దేశాల్లోనూ అర్ధరాత్రి బాణా సంచా వెలుగుల్లో నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతారు. అదేవిధంగా ఆయా దేశాల్లో ముఖ్యమైన జాతీయ ఉత్సవాల సమయంలో బాణాసంచా కాల్చడం సర్వసాధారణం. బాణాసంచా కాల్చడం అంటే మామూలుగా ఇష్టం వచ్చినట్టు కాదు. ఆ ఉత్సవాన్ని గుండెల్లో నింపుకునేంత గొప్పగా.. ఒక పధ్ధతి ప్రకారం నిర్ణీత కాలవ్యవధిలో ఆకాశం అంతా విరామం లేకుండా రంగుల నిప్పుకణికలు కనిపించేలా చేస్తారు.

రష్యాలో ఇటీవల అటువంటి బాణాసంచా కాల్చిన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఒక డ్రోన్ కెమెరాలో చిత్రీకరించాడు రష్యాలోని వీడియోగ్రాఫర్ మాగ్జిమ్ డ్రాగునోవ్. మే 9 వ తేదీన రష్యాలోని పీటర్-పాల్ కోట వద్ద జరిగిన ఈ అద్భుత బాణసంచా ఉత్సవాన్ని తన కెమెరాలో బంధించి ప్రపంచానికి చూపించాడు. ఇందుకోసం తన డ్రోన్ కెమెరాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒక యుద్ద విమానానికి జత చేశాడు మాగ్జిమ్. దీంతో మొత్తం ఆ కార్యక్రమం అంతా కన్నుల పండువలా రికార్డ్ అయింది. ఆ వీడియో ఇక్కడ చూడండి..

ఈ బాణాసంచా వేడుక రష్యా వార్షిక విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించారు. రెండో ప్రపంచ యుద్ధం ముగింపుకు గుర్తుగా ఈ వేడుక చేస్తారు. ఈ సంవత్సరం ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయం సాధించిన 76వ వార్షికోత్సవ సంవత్సరం. ఈ సందర్భంగా ఈ బాణాసంచా వేడుక నిర్వహించారు. దీనికంటే ముందు మే 7న రష్యన్ నగరమైన ర్జేవ్ లోని ప్రపంచ యుద్ధ స్మారక చిహ్నంపియా వేలాది డ్రోన్లు వెలుగులు విరజిమ్మాయి. ఆ వీడియో ఇక్కడ చూడొచ్చు.

మొత్తమ్మీద రష్యాలోని విజయోత్సవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమాలను ఈ వీడియోల ద్వారా ప్రపంచ ప్రజలు చూడగలిగారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ గా మారాయి.

తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో