PM Modi-Joe Biden: G-7 సదస్సులో వండర్.. ప్రధాని మోదీని పలకరించడానికి ప్రోటోకాల్‌ పక్కనపెట్టిన అమెరికా అధ్యక్షుడు..

|

Jun 27, 2022 | 7:00 PM

PM Modi at G7 Summit 2022: అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ ప్రోటోకాల్ పక్కన పెట్టి ప్రధాని నరేంద్ర మోదీ కలిసి మాట్లాడారు.

PM Modi-Joe Biden: G-7 సదస్సులో వండర్.. ప్రధాని మోదీని పలకరించడానికి ప్రోటోకాల్‌ పక్కనపెట్టిన అమెరికా అధ్యక్షుడు..
US President Joe Biden walks up to PM Modi to Greet him
Follow us on

G-7 సదస్సులో వండర్ జరిగింది. ప్రపంచ దేశాలు భారత్ చుట్టూ చేరాయి. ప్రపంచ దేశాల పెద్దన్న అమెరికా సైతం భారత్‌తో కలిసేందుకు అన్నింటిని పక్కన పెట్టింది. G-7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీలో పర్యటిస్తున్నారు. ఆదివారం మ్యూనిచ్‌లో జరిగిన డయాస్పోరా సదస్సులో ప్రధాని మోదీ కూడా ప్రసంగించారు. అనంతరం ప్రధాని మోడీని కలిసేందుకు ప్రపంచంలోని 12 మంది నేతలు ఉత్సాహం చూపించారు. ఇదే వరుసలో అగ్రదేశాధినేత కూడా నిలవటం పెద్ద చర్చకు దారి తీసింది.

సోమవారం నాటి సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీ ఇతర నేతలతో మాట్లాడుతుండగా..  అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అన్ని ప్రోటోకాల్‌లను ఉల్లంఘించి ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు చేరుకున్నారు. ప్రధాని భుజం తట్టి మరీ పలకరిచారు.  ఆ తర్వాత ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడిని కౌగిలించుకుని కరచాలనం చేశారు. ప్రెసిడెంట్ జో బిడెన్‌తో సహా ప్రపంచంలోని చాలా మంది శక్తివంతమైన నాయకులు ప్రధాని మోదీని చాలా ఆప్యాయంగా కలిశారు. అక్కడికి వచ్చిన నేతలు ప్రధాని మోదీని మాట్లాడేందుకు పోటీ పడ్డారు.

అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ ప్రోటోకాల్ పక్కన పెట్టి ప్రధాని మోదీ కోసం వస్తుండటం అక్కడి మీడియాతోపాటు సమావేశంలో ఉన్నవారందని ఆకట్టుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ల స్నేహపూర్వక సంభాషణను ఇక్కడ చూడండి!

అంతర్జాతీయ వార్తల కోసం