
వెస్ట్ బెంగాల్‌లో అక్రమ వలసదారుల ఏరివేత… సూపర్‌గా సక్సెస్ ఐంది. ఎస్‌ఐఆర్ ప్రక్రియ తర్వాత బెంగాల్ ఎలక్టోరల్ జాబితాలో 12 శాతం మంది అంటే.. దాదాపు 91 లక్షల ఓట్లు డిలీటైపొయ్యాయి. బెంగాల్‌లో నివాసం ఉండనివాళ్లకు, ఉన్నా సరైన రెసిడెంట్ సర్టిఫికెట్లు లేనివాళ్లకు గెటౌట్ చెప్పినంత పనిచేసింది ఇండియన్ గవర్నమెంట్. వీళ్లలో బంగ్లాదేశ్ నుంచి వచ్చి తలదాచుకున్న శరణార్థులే ఎక్కువమంది. ఇప్పుడు వాళ్లందరినీ తీసేసి, ఎలక్టోరల్ జాబితాను ట్రిమ్ చేయడంతో, బెంగాల్ గడ్డకు 12 శాతం బరువు తగ్గినట్టేగా? ఈ మెగా ఏరివేతనే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నట్టున్నారు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. నీవు నేర్పిన విద్యయే కదా అంటూ తన దేశంలో ఇమ్మిగ్రెంట్లపై ఉక్కుపాదం మోపి.. ఒక్క వేటుతో 30 లక్షలమంది అక్రమ వలసదారుల్ని తరిమికొడుతోంది అమెరికా. ఇక్కడ మోస్ట్ ఎఫెక్టెడ్ ఎవరంటే, అచ్చంగా మన ఇండియన్లే. నిజానికి, అమెరికానే కాదు, ఇమ్మిగ్రెంట్ల విషయంలో అన్ని దేశాలదీ ఇదే దారి. సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక మెగా కలుపుతీత. అమెరికా ఫస్ట్.. మిగతావన్నీ నెక్ట్స్… అనే స్లోగన్‌ను ఏ ముహూర్తాన ఎత్తుకున్నాడో గాని, అప్పటినుంచి అధ్యక్షులవారి రొడ్డకొట్టుడు మామూలుగా లేదు. ట్రేడ్ కావొచ్చు, టాక్సులు కావొచ్చు, విదేశ వ్యవహారాలు కావొచ్చు, ఇమ్మిగ్రేషన్ కావొచ్చు.. తీసుకునే నిర్ణయం ఏదైనా...