
భారత్-అమెరికా ఒప్పందంపై ఇంకా సంతకాలే జరగలేదు. భారత్–అమెరికా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన మధ్యంతర ముసాయిదాపై ఫ్రేమ్‌వర్క్ మాత్రమే రెడీ అయింది. వాళ్లకేం కావాలో అమెరికా చెప్పింది, భారత్‌కు ఏం కావాలో కేంద్రం లిస్ట్ ఇచ్చింది. ఫ్రేమ్ వర్క్ ఇద్దరికీ నచ్చితే.. అప్పుడు వచ్చే మార్చిలో సంతకాలు జరుగుతాయి. అంతదాకా ఈ మధ్యంతర ఒప్పందం అమల్లోకి రాదు. బట్.. ఇంతలోనే విపక్షాల్లో ఆందోళన కనిపిస్తోంది. రైతు సంఘాలు, కార్మికుల నుంచి వ్యతిరేకత వస్తోంది. కేంద్రం కూడా ప్రతి విమర్శకు, ప్రతి అనుమానానికి సమాధానం ఇవ్వాల్సి వస్తోంది. ఇంత గొడవ దేనికి? నేరుగా మ్యాటర్‌లోకి వస్తే.. భారత్- అమెరికా ట్రేడ్ డీల్‌లో భారత్ ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తొలగిస్తున్నట్లు కొన్ని కథనాలు వచ్చాయ్. అంతే.. దీనిపై రైతు సంఘాలు నిరసన తెలిపాయి. రైతుల్లో ఈ అనుమానాలు రావడానికి కాంగ్రెస్ పార్టీ సంధించిన ప్రశ్నలు కూడా కారణమే. అమెరికాతో ఒప్పందంలో భాగంగా.. వచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన సరుకులను భారత్ దిగుమతి చేసుకోవాలి. అంటే.. ఇప్పుడు జరుగుతున్న దిగుమతులకు దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ఇప్పటిదాకా ఏటా అమెరికా నుంచి 40 నుంచి 42 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు...