
వాషింగ్టన్ తాజాగా ప్రారంభించిన “ఆపరేషన్ ఎకనామిక్ అవుట్ కాస్ట్ “లో భాగంగా ఈ చర్యలు చేపట్టింది. ఇరాన్ ప్రభుత్వానికి అందుతున్న ఆర్థిక వనరులను పూర్తిగా అణచివేయడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం.
పోర్టీజ్ పార్ట్నర్స్ ఎల్ఎల్పీ అనే కస్టమ్స్ బ్రోకర్ సంస్థ ఇరాన్‌కు చెందిన పెట్రోకెమికల్ ఉత్పత్తులను భారత్‌కు దిగుమతి చేయడంలో కీలక పాత్ర పోషించిందని అమెరికా ఆరోపించింది. హరీశ్ రామచంద్ర రంగి, ఇంద్రిస్మియాషేక్ , ఈ ఇద్దరు భాగస్వాములపై కూడా ఆంక్షల వేటు పడ్డాయి. రెండవది సదాశివ ఓవర్సీస్ లిమిటెడ్. ఈ కంపెనీ దాదాపు 69 మిలియన్ డాలర్ల అంటే దాదాపు రూ. 570 కోట్లు విలువైన ఇరాన్ పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నట్లు వాషింగ్టన్ ఆరోపించింది.
పీపీ సాఫ్ట్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్, అధినేత ప్రశాంత్ గార్గ్‌పై ఆంక్షలు విధించింది. నాల్గవది ప్రకృతీస్ ఇన్ఫ్రా ఇంపాక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీకి కూడా 25 మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి వ్యాపారంలో భాగస్వామ్యం ఉన్నట్లు తేల్చింది.
ఇరాన్‌కు చెందిన పెట్రోకెమికల్ ఉత్పత్తుల కొనుగోలు, విక్రయం, రవాణా లేదా మార్కెటింగ్‌కి సంబంధించి ఉద్దేశపూర్వకంగానే వీరు పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపినట్లు అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఏకకాలంలో ప్రకటించిన 60 మంది వ్యక్తులు, సంస్థలు, నౌకల జాబితాలో ఈ భారతీయ సంస్థలు ఉన్నాయి.
ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు అమెరికా ఒకవైపు కఠిన ఆంక్షలు విధిస్తూనే, మరోవైపు దౌత్యపరమైన సంకేతాలను కూడా ఇస్తోంది. ఇరాన్‌తో వ్యాపారం కొనసాగించే దేశాలను శిక్షిస్తామని అమెరికా హెచ్చరించినప్పటికీ, వెంటనే ఎలాంటి జరిమానాలు లేదా కఠిన చర్యలు ఉండబోవని స్పష్టం చేసింది.
మధ్యప్రాచ్యంలో ఇరాన్‌తో ఉద్రిక్తతల కారణంగా గతంలో ఖాళీ చేసిన కొన్ని దౌత్య కార్యాలయాలకు అమెరికా మళ్లీ సిబ్బందిని పంపుతోంది. ఇరాన్‌తో ఘర్షణలు తీవ్రతరం అయ్యే ప్రమాదం తక్కువగా ఉందని వాషింగ్టన్ అంచనా వేస్తున్నట్లు దీని ద్వారా తెలుస్తోంది. అయితే, ప్రారంభంలో ఈ ఎంబసీలు పూర్తి స్థాయి సామర్థ్యంతో కాకుండా పరిమిత సిబ్బందితోనే పనిచేయనున్నాయి.