Girl Missing: అకస్మాత్తుగా అదృశ్యమైన బాలిక.. రంగంలోకి దిగిన డ్రోన్లు, జాగిలాలు

అమెరికాలోని ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. బంధువుల పిల్లలతో కలిసి తిరగడానికి సరదాగా పార్కుకు వెళ్లిన చార్లెట్‌ సేనా అనే 9 ఏళ్ల చిన్నారి అదృశ్యమైపోవడం కలకలం రేపింది. ఆ చిన్నారి కోసం ఎంత వెతికినా దొరకకపోవడంతో.. ఆమె బంధువులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఇక ఆ చిన్నారి ఆచూకీ కనిపెట్టడానికి రంగంలోకి దిగింది అధికార యంత్రాంగం. ఆ చిన్నారి కోసం 100 మంది పోలీసులతో సహా డ్రోన్లను అలాగే జాగిలాలను రంగంలోకి దించింది.

Girl Missing: అకస్మాత్తుగా అదృశ్యమైన బాలిక.. రంగంలోకి దిగిన డ్రోన్లు, జాగిలాలు
Child Missing

Updated on: Oct 02, 2023 | 6:04 PM

అమెరికాలోని ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. బంధువుల పిల్లలతో కలిసి తిరగడానికి సరదాగా పార్కుకు వెళ్లిన చార్లెట్‌ సేనా అనే 9 ఏళ్ల చిన్నారి అదృశ్యమైపోవడం కలకలం రేపింది. ఆ చిన్నారి కోసం ఎంత వెతికినా దొరకకపోవడంతో.. ఆమె బంధువులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఇక ఆ చిన్నారి ఆచూకీ కనిపెట్టడానికి రంగంలోకి దిగింది అధికార యంత్రాంగం. ఆ చిన్నారి కోసం 100 మంది పోలీసులతో సహా డ్రోన్లను అలాగే జాగిలాలను రంగంలోకి దించింది. అయితే ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో శనివారం సాయంత్రం జరిగినట్లు అక్కడి గవర్నర్‌ కథీ హోచౌల్‌ తాజాగా మీడియాకు చెప్పారు. అయితే ఆమె చివరిసారిగా మోరే లేక్‌ స్టేట్‌ పార్కులో మోటారు సైకిల్‌పై వెళ్తుండగా పోలీసులు గుర్తించారు. అయితే ఆ చిన్నారి ఎవరో అపహరించి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు.

ఇదిలా ఉండగా.. గవర్నర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం చూసుకుంటే.. చార్లెట్‌ సేనా అనే బాలిక శనివారం సాయంత్రం పూట బంధువుల పిల్లలతో కలసి మోటారు సైకిల్‌పై బయటకు వెళ్లింది. అయితే ఆ సమయంలో అంతగా చీకటి కూడా కాలేదు. వాళ్లతో కలిసి మోరే లేక్‌ స్టేట్‌ పార్కులో కొన్ని రౌండ్లు కొట్టింది ఆ చిన్నారి. ఆ తర్వాత తాను ఒంటరిగా మరో రౌండ్‌ తిరుగుతానని చెప్పి వెళ్లిపోయింది. కానీ సుమారు 15 నిమిషాల వరకు గడిచినా ఇంకా ఆ బాలిక వెనక్కి రాలేదు. మిగతా పిల్లలు ఆమె తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పార. దీంతో ఒక్కసారిగా కంగారుపడిపోయిన తల్లిదండ్రులు ఆ చిన్నారి కోసం వెతకడం ప్రారంభించారు. అందరూ కలిసి వెతికినా కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో అక్కడికి అరగంట తర్వాత సాయంత్రం 6.47 సమయంలో చార్లెట్‌ తల్లి త్రిష అత్యవసర హెల్ప్‌లైన్‌ నెంబర్‌ అయిన 911కి ఫోన్‌ చేసి ఈ సంగతి చెప్పారు. 7 గంటల ప్రాంతంలో పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని ఆమెకు సంబంధించిన వివరాలను ఆరా తీశారని గవర్నర్ హోచౌల్ తెలిపారు.

అయితే పోలీసులు, బాలిక తల్లిదండ్రులు కలిసి పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా ఆమె జాడ దొరకలేదు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు న్యూయార్క్‌ పోలీసులతోపాటు, జాగిలాలు, డ్రోన్లు, ప్రత్యేక స్పందన బృందాలను రంగంలోకి దింపారు. అలాగే వీరితో సహా ఫారెస్ట్‌ రేంజర్లు, నీటి అడుగున సహాయక చర్యలు చేపట్టే బృందాలను సైతం అందుబాటులో ఉంచారు. గత 18 గంటలుగా వీళ్లంతా గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇప్పటిదాక ఆ బాలిక ఆచూకీ మాత్రం ఎక్కడ కనిపించలేదు. మరోవైపు ప్రస్తుతం ఈ కేసును సవాలుగా తీసుకున్నామని.. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామని గవర్నర్‌ పేర్కొన్నారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో న్యూయార్క్‌ పోలీసులు ‘అంబర్‌ అలర్ట్‌ను’ ప్రకటించారు. అంబర్ అలర్ట్ అంటే పిల్లలు అపహరణకు గురైన సందర్భాల్లో ఈ హెచ్చరికను జారీ చేస్తారు. అలాగే తప్పిపోయిన ఆ పిల్లలను గుర్తించేందుకు ప్రజలు కూడా పోలీసులకు సాయం చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.