Russia Ukraine War News: ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధులు శాంతి చర్చల్లో పాల్గొంటున్నారు. బెలారస్ బోర్డర్‌లో చర్చలు జరుగుతున్నాయి. రష్యా ప్రతినిధులకంటే ముందే ఉక్రెయిన్ ప్రతినిధుల బృందం మీటింగ్ హాల్‌కి చేరుకుంది. శాంతి చర్చల్లో ఎలాంటి నిర్ణయం రాబోతుందన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంటోంది. కాల్పుల విరమణ, ఉక్రెయిన్‌లోని రష్యా సేనల ఉపసంహరణ శాంతి చర్చల్లో తమ ప్రధాన లక్ష్యంగా ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.
శాంతి చర్చల నేపథ్యంలో ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు తగ్గాయి. ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమణలు తగ్గడంతో ప్రజలు కాస్త ఊరట చెందుతున్నారు. ప్రజలపై దాడులు చేయబోమన్న రష్యా ఆర్మీ.. కీవ్‌ని ప్రజలు వదిలి వెళ్లొచ్చని సూచించింది. అటు కివ్‌లో కర్ఫ్యూని ఉక్రెయిన్ ప్రభుత్వం ఎత్తివేసింది. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ గగనతలంపై పట్టుసాధించామని రష్యా ప్రకటించింది.
శాంతి చర్చల కోసం బెలారస్ బోర్డర్‌కు చేరుకుంటున్న ఉక్రెయిన్ ప్రతినిధులు…
The delegates arrived at the negotiating venue by helicopter. pic.twitter.com/jumBclmFwf
— NEXTA (@nexta_tv) February 28, 2022
దేశం విడిచి వెళ్లిపోండి.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
ఉక్రెయిన్‌లోని రష్యా సేనలు తమ దేశం విడిచి ప్రాణాలు కాపాడుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హితవు పలికారు. ఉక్రెయిన్ దేశంలోని ప్రతి పౌరుడూ ఒక సైనికుడేనని చెప్పారు. దేశానికి ప్రతి పౌరుడు దేశాధ్యక్షుడేనని తాను గతంలో చెప్పానని గుర్తు చేశారు. దేశానికి ఏం జరిగినా దాని బాధ్యత అందరికీ ఉంటుందన్నారు. యూరోపియన్ యూనియన్(EU)లో ఉక్రెయిన్‌కి తక్షణమే సభ్యత్వం కల్పించాలని జెలెన్ స్కీ డిమాండ్ చేశారు.
రష్యా దాడుల్లో అమాయకులు మరణిస్తున్నారు.. భారత్‌లో ఉక్రెయిన్ దౌత్యవేత్త
రష్యా సేనలు జరుపుతున్న దాడుల్లో తమ దేశంలోని అమాయక పౌరులు భారీ సంఖ్యలో మరణించినట్లు భారత్‌లోని ఉక్రెయిన్ దౌత్యవేత్త డాక్టర్ ఇగోర్ పొలిఖ తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రష్యా బాంబు దాడుల్లో 16 మంది చిన్నారులు మృతి చెందినట్లు ఆవేదన వ్యక్తంచేశారు. భారత్, ఇదర దేశాలు యుద్ధాన్ని ఆపేలా రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
యుఎన్ హ్యూహన్ రైట్స్ కార్యాలయంలో అత్యవసర సమావేశం
ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు జెనీవాలోని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలంలో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.
Also Read…
Challan Payment: వాహనదారులకు అలెర్ట్.. రేపటి నుంచే పెండింగ్ చలానాలపై భారీ డిస్కౌంట్
Russia Ukraine War: రష్యా అమ్ములపొదిలో హైడ్రోజన్ బాంబ్.. అది ఏదైనా మెట్రో నగరం మీద పడితే..