Ukraine vs Russia: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భీకర పోరు.. ఎవరూ తగ్గట్లేదుగా..

Ukraine vs Russia: ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఆధిక్యతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఉక్రెయిన్‌, రష్యా సైన్యాలు. రష్యా వెనక్కి వెళ్లినట్లే వెళ్లి..

Ukraine vs Russia: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భీకర పోరు.. ఎవరూ తగ్గట్లేదుగా..
Russia Ukraine War

Updated on: Sep 14, 2022 | 6:25 AM

Ukraine vs Russia: ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఆధిక్యతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఉక్రెయిన్‌, రష్యా సైన్యాలు. రష్యా వెనక్కి వెళ్లినట్లే వెళ్లి ఎదురు దాడులకు దిగుతోంది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా, ఇప్పుడు ఈ యుద్ధం నుంచి ఎలా బయటపడాలో తెలియక తంటాలు పడుతోంది. కొద్ది రోజులుగా ఉక్రెయిన్‌ దళాలు మెరుపు దాడులు చేపట్టడంతో ఖార్కివ్‌ నుంచి వెనక్కి తగ్గాయి రష్యా దళాలు. రష్యా ఆక్రమించుకున్న ప్రదేశాల నుంచి ఆరువేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. డాన్‌బాస్క్‌లో చాలా భూభాగాన్ని తిరిగి సొంతం చేసుకున్నామని చెబుతోంది.

అయితే రష్యా వాదన మరోరకంగా ఉంది. అనవసర ప్రాణ నష్టాన్ని నివారించడానికే తాము వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గామని అంటోంది. ఖార్కివ్‌లోని ఈశాన్య ప్రాంతం నుంచి తాము వైదొలిగినట్లు రష్యా అంగీకరించింది. అయితే లుహాన్‌స్క్‌, దోనెస్క్‌ ప్రాంతాలపై ఫోకస్‌ పెంచడానికి తాము వెనక్కి తగ్గినట్లు తెలిపింది. కాగా వెనక్కి వెళ్లినట్లే వెళ్లి హఠాత్తుగా దాడులకు దిగుతోంది. వైమానిక దాడులతో విద్యుత్కేంద్రాలపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. దీంతో చాలా ప్రాంతాలు చీకట్లలోనే మగ్గుతున్నాయి.

మరోవైపు చెచెన్‌ తిరుగుబాటు వర్గం నేత రంజాన్‌ కదిరోవ్‌కి చెందిన కొత్త వీడియో బయటకు వచ్చింది. గ్రోజ్నీలో పెద్దఎత్తున మోహరించిన మిలటరీని ఆయన ఉద్దేశించి ప్రసంగించారు. తదుపరి దాడులకు సిద్ధం కావాలని తమ సేనలకు పిలుపునిచ్చారు. అయితే ఒక తిరుగుబాటు నేతకు ఇంత మిలటరీ ఉంటుందా అన్నదే ఆసక్తిగా మారింది. రష్యా మద్దతు ఇస్తున్న కదిరోవ్‌ ఉక్రెయిన్‌లో దాడులకు స్కెచ్‌ గీస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..