లండన్: సీటు బెల్ట్ ధరించకుండా కారులో ప్రయాణించి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కు పోలీసులు జరిమానా విధించారు. సోషల్ మీడియాలో లైవ్ వీడియో చేస్తున్నప్పుడు , రిషి సునక్ సీట్ బెల్ట్ ధరించకుండా కారు వెనుక సీటులో కూర్చున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది గమనించిన బ్రిటీష్ పోలీసులు రిషికి జరిమానా విధించడంతో ఈ వార్త మరింత వైరల్‌గా మారింది.
దీనిపై స్పందించిన రిషి సునక్.. ‘ఇది అర్థం చేసుకోవడంలో జరిగిన చిన్న పొరపాటు’. ఉత్తర ఇంగ్లాండ్‌లో కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రిషీ సునక్‌కు ఇది 2వ పెనాల్టీగా తెలిసింది. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ గతేడాది ప్రధాని బోరిస్ జాన్సన్‌తో పాటు రిషికి జరిమానా విధించారు.
? | NEW: PM Rishi Sunak was NOT wearing a seatbelt in a video recorded in his Government car this morning pic.twitter.com/SOLn5YGnT7
— Politics UK ?? (@POLITlCSUK) January 19, 2023
ప్రధానమంత్రి రిషి సునక్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడంలో తప్పు జరిగిందని అంగీకరించారు. దీనికి క్షమాపణలు చెప్పారు. బ్రిటీష్ పోలీసులు విధించిన జరిమానాను ఖచ్చితంగా చెల్లిస్తానని రిషి డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయ ప్రతినిధి తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..