New virus: 82 దేశాల్లో వేగంగా విస్తరించిన కొత్తరకం వైరస్‌.. బ్రిటన్‌, దక్షిణాఫ్రికాల్లో గుర్తింపు

|

Feb 03, 2021 | 12:23 PM

New virus: ఒక వైపు కరోనా మహమ్మారి పూర్తిస్థాయిలో కట్టడి రాకముందే మరో కొత్త వైరస్‌ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. యూకేలో బయట పడిన కొత్త రకం కరోనా వైరస్‌..

New virus: 82 దేశాల్లో వేగంగా విస్తరించిన కొత్తరకం వైరస్‌.. బ్రిటన్‌, దక్షిణాఫ్రికాల్లో గుర్తింపు
Follow us on

New virus: ఒక వైపు కరోనా మహమ్మారి పూర్తిస్థాయిలో కట్టడి రాకముందే మరో కొత్త వైరస్‌ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. యూకేలో బయట పడిన కొత్త రకం కరోనా వైరస్‌ ఇప్పటికే 82 దేశాలకు పాకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌ వైరస్‌ కూడా దాదాపు 40 దేశాల్లో విస్తరించిందని, అలాగే బ్రెజిల్‌ కొత్త రకం వైరస్‌ 9 దేశాలకు పాకిందన్నారు. అమెరికాలో మొత్తం 471 కొత్తరకం కేసులు బయటపడగా, వీటిలో 467 కేసులు బ్రిటన్‌ రకం, మూడు కేసులు దక్షిణాఫ్రికా రకం, మరో కేసు బ్రెజిల్‌ రకం వైరస్‌ నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఇక భారత్‌లోనూ బ్రిటన్‌ స్ట్రెయిన్‌ వైరస్‌ కేసుల సంఖ్య 150 దాటాయి.

బ్రిటన్‌, దక్షిణాఫ్రికాల్లో వెలుగు చూసిన కరోనా స్ట్రెయిన్‌ వైరస్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. అయితే సాధారణ రకం కంటే ఈ కొత్తరకం వైరస్‌ దాదాపు 40 శాతం వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా బ్రిటన్‌లో కోవిడ్‌ మరణాలు పెరగడానికి ఈ రకం కారణమని భావిస్తున్నారు. ఈ సమయంలో కొత్త రకం వైరస్‌ మరోసారి రూపు మర్చుకుంటున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. దక్షిణాఫ్రికా, బ్రిటన్‌, బ్రెజిల్‌ దేశాల్లో బయటపడిన కొత్త రకం వైరస్‌లో తాజా మ్యుటేషన్‌ చెందిన రకాన్ని గుర్తించినట్లు ఇంగ్లాండ్‌ ఆరోగ్యశాఖ నిపుణులు పేర్కొన్నారు.

Also Read: Coronavirus Telangana: తెలంగాణలో కొత్త కరోనా కేసులు 185… మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?