కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న యూఏఈ ప్రధాని

కరోనా వైరస్ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంది. రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతుండటంతో అన్నిదేశాలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి.

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న యూఏఈ ప్రధాని
Follow us

|

Updated on: Nov 03, 2020 | 6:50 PM

కరోనా వైరస్ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంది. రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతుండటంతో అన్నిదేశాలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌కు కరోనా వ్యాక్సిన్‌ను వేయించుకున్నారు. తాను కొవిడ్-19 వైరస్ వ్యాక్సిన్‌ను వేయించుకున్న ఫోటోను యూఏఈ ప్రధాని ట్వీట్ చేశారు. యూఏఈలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంచడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన వైద్య పరిశోధన బృందాల గురించి మేము గర్విస్తున్నామని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. సెప్టెంబరులో యూఏఈ తన ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు అత్యవసర ఉపయోగం కోసం చైనా కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను ఆమోదించింది. ఇది సత్పలితాలు ఇవ్వడంతో తానూ కూడా వ్యాక్సిన్ ను వేయించుకున్నట్లు వెల్లడించారు.