ప్రపంచవ్యాప్తంగా ది బెస్ట్ కంట్రీగా స్విట్జర్లాండ్ మరోసారి ఘనతను సొంతం చేసుకుంది. యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసిన బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ 2024లో వరుసగా మూడోసారి టాప్ ప్లేస్‌ను సొంతం మొదటి స్థానంలో ఉండగా, భారతదేశం గత ఏడాది నుంచి ఇప్పుడు మూడు స్థానాలకు దిగి 33వ స్థానంలో ఉంది.
స్విట్జర్లాండ్ పర్యాటకులకు స్వర్గధామంగా నిలిచే చిన్న సిటీ.. అయినప్పటికీ ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా అరుదైన ఘనత సాధించింది. సాహసం, వాససత్వం, వ్యాపార అవకాశాలు, జీవన నాణ్యత పరిణామాలు, సంస్కృతి, సంప్రదాయాలు,సాంస్కృతిక ప్రయోజనం వంటి వివిధ అంశాల ఆధారంగా నిర్వహించిన సర్వే ద్వారా తాజాగా ర్యాంకింగ్స్ రిలీజ్ అయ్యాయి. ఈ సర్వే ఆధారంగా 89 దేశాలకు ర్యాంక్ ఇచ్చింది. స్విట్జర్లాండ్ జీవన నాణ్యత , వ్యాపార అవకాశాలు ఉన్నత స్థానంలో ఉండగా, వారసత్వ రంగంలో ఇది అత్యల్ప ర్యాంకింగ్ లో ఉంది. అయినప్పటికీ మెజార్టీ విభాగాల్లో ఉన్నతంగా ఉన్న స్విట్జర్లాండ్.. ఈ జాబితాలో తొలి స్థానం దక్కించుకుంది.
ఈ సర్వేలో సెంట్రల్ యూరోపియన్ దేశమైన స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలవడం ఇది ఏడవసారి.. ఐరోపా దేశాలు టాప్ 25లో మెజారిటీగా స్థానాలను దక్కించుకున్నాయి. తాజా ర్యాంకింగ్‌లో స్విట్జర్లాండ్ తర్వాత రెండోస్థానంలో జపాన్, ఆ తర్వాత.. వరుసగా.. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా చోటు దక్కించుకున్నాయి.
ఈ సంవత్సరం జాబితాలో భారతదేశం 33వ స్థానంలో నిలిచింది, 2023లో జాబితాలో దాని స్థానం నుండి మూడు స్థానాలు పడిపోయింది. జపాన్, సింగపూర్, చైనా, దక్షిణ కొరియా మాత్రమే ఆసియా నుండి మొదటి 25 స్థానాల్లో నిలిచాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ మాత్రమే రెండు మధ్య-ప్రాచ్య దేశాలు వరుసగా 17 , 25 ప్లేసెస్ లో నిలిచాయి.
స్విట్జర్లాండ్‌లా కాకుండా భారతదేశం అత్యున్నత ర్యాంకింగ్ ‘మూవర్స్’ (సంఖ్య 7), వారసత్వం ( హెరిటేజ్ సంఖ్య 10) రంగంలో ముందు ఉంది. ‘మూవర్స్’ భారీ వెయిటేజీతో ఉప-ర్యాంకింగ్, దేశం స్థితిస్థాపకత, అనుకూలతను కొలుస్తుంది. ఆయితే సామాజిక ప్రయోజనం, సాహస విభాగాల్లో భారతదేశ ర్యాంకింగ్ దారుణంగా ఉంది.
US న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ ద్వారా ది బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ 2024.. ఇది తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం దేశం అంటే కేవలం సంపద ఉన్నవి మాత్రమే కావని.. అంతకు మించి దేశాలకు విలువలు ఉండాలని పరిశీలించడానికి ప్రయత్నిస్తుంది. ఈ ర్యాంకింగ్‌ను రూపొందించడానికి 36 దేశాల నుండి మొత్తం 16,960 మంది వ్యక్తులు సర్వే చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..