Thugs Killed Two Judges: ఆఫ్ఘనిస్తాన్‌ రెచ్చిపోయిన దుండగులు.. పట్టపగలు నడిరోడ్డుపై ఇద్దరు జడ్జిలు దారుణ హత్య..

Thugs Killed Two Judges: ఆఫ్ఘనిస్తాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆదేశ అత్యున్నత న్యాయస్థానానికి చెందిన న్యాయమూర్తులకే అక్కడ రక్షణ..

Thugs Killed Two Judges: ఆఫ్ఘనిస్తాన్‌ రెచ్చిపోయిన దుండగులు.. పట్టపగలు నడిరోడ్డుపై ఇద్దరు జడ్జిలు దారుణ హత్య..

Updated on: Jan 17, 2021 | 7:42 PM

Thugs Killed Two Judges: ఆఫ్ఘనిస్తాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆదేశ అత్యున్నత న్యాయస్థానానికి చెందిన న్యాయమూర్తులకే అక్కడ రక్షణ లేకుండా పోయింది. ఆఫ్ఘనిస్తాన్ సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు మహిళా జడ్జిలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో ఆదేశ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అక్కడి అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆఫ్ఘినిస్తాన్‌లో కొందరు దుండగులు రెచ్చిపోయారు.ఆప్ఘనిస్తాన్‌ సుప్రీంకోర్టులో న్యాయమూర్తులైన ఇద్దరు మహిళా జడ్జిలపై కాల్పులకు తెగబడ్డారు. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే వారు ప్రయాణిస్తున్నకారుపై బుల్లెట్ల వర్షం కురిపించారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

కాగా, ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళా న్యాయమూర్తులు స్పాట్‌లోనే ప్రాణాలు వొదిలారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఆదేశ అధికారులు.. దుండగులు ఎవరనేది తేల్చి పనిలో పడ్డారు. కాగా, దేశ అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసే న్యాయమూర్తులకే రక్షణ లేకపోతే.. తమ పరస్థితి ఏంటని ఆ దేశ ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

Also read:

తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మాయం కేసులో క్లారిటీ.. ప్రైవేట్ ఆస్పత్రిలో మళ్లీ టెస్టులు.. ఏం తేలిందంటే

TRS Party: వారిపై కక్షగడుతున్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..