Turkey Earthquake: మృత్యుంజయుడు.. 278 గంటల తరువాత శిథిలాల నుంచి సజీవంగా బయటపడిన వ్యక్తి..

టర్కీలో భూకంపం తరువాత శిథిలాల నుంచి ఇంకా జనం సజీవంగా బయటపడుతుండటం సంచలనం రేపుతోంది. 278 గంట‌ల త‌ర్వాత‌.. దాదాపు 12 రోజుల త‌ర్వాత..

Turkey Earthquake: మృత్యుంజయుడు.. 278 గంటల తరువాత శిథిలాల నుంచి సజీవంగా బయటపడిన వ్యక్తి..
Turkey Earthquake

Updated on: Feb 18, 2023 | 3:58 PM

టర్కీలో భూకంపం తరువాత శిథిలాల నుంచి ఇంకా జనం సజీవంగా బయటపడుతుండటం సంచలనం రేపుతోంది. 278 గంట‌ల త‌ర్వాత‌.. దాదాపు 12 రోజుల త‌ర్వాత కూడా ఓ వ్యక్తి శిథిలాల కింద స‌జీవంగా ఉన్నాడు. 45 ఏళ్ల ఆ వ్యక్తి పేరు హ‌క‌న్ యాసింగ్లో.. అని రెస్క్యూ సిబ్బంది చాలా చాకచక్యంగా అతన్ని రక్షించారని అధికారులు తెలిపారు. టర్కీ, సిరియా భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది. కాగా, టర్కీ భూకంపంలో ఇప్పటివరకు 41 వేల మందికి పైగా మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

భూకంప ప్రభావిత ప్రాంతాల నుంచి శిథిలాల తొలగింపు వేగంగా కొనసాగుతోంది. హ‌టాయ్ ప్రాంతంలో భారీ సంఖ్యలో వందలాది బిల్డింగ్‌లు నేల‌మ‌ట్టం అయ్యాయి. నేల‌మ‌ట్టం అయిన ఓ బిల్డింగ్ నుంచి హ‌క‌న్ యాసింగ్లోను కాపాడినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద యాసింగ్లోను గుర్తించిన సిబ్బంది.. అతన్ని వెంటనే అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి త‌ర‌లించారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

ఇంకా 200 ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. అధికారులు వెల్లడించారు. అంతకుముందు గురువారం కూడా ముగ్గుర్ని కూడా రక్షించినట్లు తెలిపారు. సజీవంగా బయటపడ్డ వారిలో 14 ఏళ్ల బాలుడు ఉన్నాడన్నారు. కాగా.. భూకంపంతో 11 ప్రావిన్సుల్లో భారీ న‌ష్టం సంభవించగా.. ఆద‌నా, కిలిస్‌, స‌నిలుర్ఫా ప్రావిన్సుల్లో రెస్క్యూ ఆప‌రేష‌న్ ముగిసిన‌ట్లు టర్కీ అధికారులు తెలిపారు. ఈ భూకంపంతో 84 వేల బిల్డింగ్‌లు ధ్వంసం అయ్యాయని.. లక్షలాది కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..