Turkey Earthquake: పొంచి ఉన్న మరో ముప్పు.. ఆయన చెప్పినట్లు ఇవాళ భారీ భూకంపం వస్తుందా?!

వరుసగా భారీ భూకంపాలు.. ఊగిపోతూ పేక మేడల్లా కూలిన భారీ భవనాలు.. వాటి కింద ఛిద్రమైన బతుకులు.. విగతజీవుల్ని చూసి మిన్నంటుతున్న అయినవాళ్ల రోదనలు.

Turkey Earthquake: పొంచి ఉన్న మరో ముప్పు.. ఆయన చెప్పినట్లు ఇవాళ భారీ భూకంపం వస్తుందా?!
Turkiye Syria Earthquake

Updated on: Feb 08, 2023 | 6:20 AM

వరుసగా భారీ భూకంపాలు.. ఊగిపోతూ పేక మేడల్లా కూలిన భారీ భవనాలు.. వాటి కింద ఛిద్రమైన బతుకులు.. విగతజీవుల్ని చూసి మిన్నంటుతున్న అయినవాళ్ల రోదనలు. సాయం కోసం శిథిలాల కిందే ఆర్తనాదాలతో ఎదురుచూపులు. ఈలోపే మళ్లీ ప్రకంపనలు.. టర్కీ, సిరియాలో.. ఊరు, పట్టణాలనే తేడా లేకుండా మరు భూములుగా మారిపోయాయి. ఎక్కడ చూసినా ఆర్తనాదాలే! వరుస భూకంపాలతో కన్నుమూసి తెరిచేలోగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

ఈ భయం ఇలా ఉండగానే.. ఫ్రాంక్ హూగర్ బీట్స్ మరో షాకింగ్ న్యూస్ వచ్చేసింది. ఇప్పటికే వరుస భూప్రకంపనలతో మరుభూమిగా మారిన టర్కీలో మరో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందంటూ ఫ్రాంక్ హూగర్ బీట్స్ పేరుతో ట్వీట్ చేశారు. అంతేకాదు.. భూకంప తీవ్రత 6 గా ఉంటుందని ప్రకటించారు. ఇప్పుడిదే టర్కీ వాసులను మరింత భయబ్రాంతులకు గురి చేస్తుంది.

అంతకుముందు టర్కీలో భారీ భూకంపం సంభవించనుందంటూ ఘటనకు నాలుగు రోజుల ముందే ట్విట్టర్‌ వేదికగా చెప్పారు. భూకంపం సంభవించే ఖచ్చితమైన తేదీ, భూకంప తీవ్రత సహా వివరాలను ముందే చెప్పారు. ఇప్పుడు ఫిబ్రవరి 8న కూడా భారీ భూకంపం సంభవిస్తుందని చెప్పడం, భూకంపం తీవ్రతను కూడా పేర్కొనడంతో జనాలు హడలిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..