“క్వీన్ ఆఫ్ వాటర్” అనే చేప గురించి ఎప్పుడైనా, ఎక్కడైనా విన్నారా..? కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక, దాని ధర తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. న్యూ ఇయర్ సందర్భంగా జపాన్‌లోని టోక్యోలో నిర్వహించిన చేపల వేలంలో ఈ చేప ధర కలకలం సృష్టించింది. టోక్యోలోని చేపల మార్కెట్‌లో జరిగిన ఈ వేలం రికార్డులను బద్దలు కొట్టింది. కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన ఈ చేప పేరు బ్లూఫిన్ ట్యూనా. దాని స్పెషల్ ఏంటో పూర్తి వివరాల్లోకి వెళితే…
జపాన్‌లో జరిగిన ఓ వేలంలో 276 కిలోల ట్యూనా చేప ఏకంగా రూ.11 కోట్లు పలికింది. ట్యూనా ఇంత ధర పలకడం విశేషం. టోక్యో ఫిష్ మార్కెట్‌లో ఈ భారీ చేపను వేలం వేశారు. ఈ ట్యూనా కోసం ప్రముఖ రెస్టారెంట్లలో ఒకటైన సుషీ రెస్టారెంట్ 207 మిలియన్ యెన్‌లను ($1.3 మిలియన్లు లేదా రూ.11 కోట్లు) చెల్లించింది. కాగా, 2019లో 276 కిలోల బ్లూఫిన్ ట్యూనా చేప అప్పటి వేలంలో 333.6 మిలియన్ యెన్‌లు (రూ.18 కోట్లకు పైగా) పలికింది.
ఈ చేప దాని వేగానికి ప్రసిద్ధి చెందింది. దాని పరిమాణం మోటార్ సైకిల్‌తో సమానంగా ఉంటుంది. దీని సగటు వయస్సు 40 సంవత్సరాలు. సముద్రంలో లోతుగా దూకే ఈ చేప తన ప్రత్యేక గుణాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. 1999 డేటా ప్రకారం, టోక్యో చేపల మార్కెట్‌లో వేలంలో విక్రయించబడిన రెండవ అత్యంత ఖరీదైన చేప. ఈ చేపను కొనుగోలు చేసేందుకు ఓ రెస్టారెంట్ రూ. 11 కోట్లు ఖర్చు చేసింది. దీంతో ఈ వార్త ఇంటర్‌నెట్‌ను సూతం షేక్ చేస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి