Tsunami Alert: వణికిస్తున్న వరుస భూకంపాలు.. సోలోమన్‌ దీవుల్లో భారీ ప్రకంపనలు.. సునామీ హెచ్చరిక జారీ

పలు దేశాల్లో గత కొద్ది రోజులుగా సంభవిస్తున్న వరుస భూకంపాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మంగళవారం ఉదయం సోలమన్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది.

Tsunami Alert: వణికిస్తున్న వరుస భూకంపాలు.. సోలోమన్‌ దీవుల్లో భారీ ప్రకంపనలు.. సునామీ హెచ్చరిక జారీ
Tsunami Alert

Updated on: Nov 22, 2022 | 9:14 AM

Solomon Tsunami alert : పలు దేశాల్లో గత కొద్ది రోజులుగా సంభవిస్తున్న వరుస భూకంపాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మంగళవారం ఉదయం సోలమన్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది . భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదైంది. భారీ భూకంపం దృష్ట్యా సోలోమాన్ (Solomon earthquake) దీవుల్లో సునామీ హెచ్చరిక కూడా జారీ చేశారు. అయితే ప్రాణ ఆస్థి నష్టంపై ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. మలాంగోకు 17కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.3గా నమోదైనట్లు వెల్లడించారు. సునామీ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. దాదాపు 20 సెకన్లపాట్లు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు.

సోలమన్ దీవుల్లోని మలాంగోకు నైరుతి ప్రాంతంలో ఈరోజు ఉదయం 7.33 గంటలకు భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు. మరిన్ని ప్రకంపనలు కూడా వచ్చే అవకాశముందని.. అప్రమత్తంగా ఉండాలని పేర్కొంంది. సునామీ హెచ్చరికలను సైతం జారీ చేసింది.

ఇండోనేషియా, గ్రీస్‌లో ఒకరోజు క్రితం భారీ భూకంపం సంభవించింది. గ్రీస్‌లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. ఇండోనేషియాలో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. పశ్చిమ జావా ప్రావిన్స్‌లోని సియాంజూర్ ప్రాంతంలో 10 కిలోమీటర్ల (6.2 మైళ్ళు) లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. ఇండోనేషియాలో భూకంపతో భారీ ప్రాణ, ఆస్థినష్టం వాటిల్లింది.

ఇవి కూడా చదవండి

భూకంపం సంభవించి 162 మందికి పైగా మరణించారు. భూకంపం వందలాది భవనాలు దెబ్బతిన్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..