Green Card Crackdown: గ్రీన్‌ కార్డ్‌కు ట్రంప్ రెడ్‌ కార్డు.. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతున్న భారతీయులు

గ్రీన్‌కార్డ్‌కు రెడ్‌కార్డు చూపుతున్నారు..అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌. దీంతో భారతీయులతో పాటు అమెరికా కంపెనీలకు కూడా ఇబ్బందలు తప్పడం లేదు. ప్రస్తుతం అమెరికాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్పొరేట్‌ లీడర్లు, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ల వర్క్ పర్మిట్‌లు ముగియడంతో వారంతా కూడా ఉద్యోగాలు కోల్పోతున్నారు.

Green Card Crackdown: గ్రీన్‌ కార్డ్‌కు ట్రంప్ రెడ్‌ కార్డు.. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతున్న భారతీయులు
Donald Trump

Updated on: Jul 22, 2025 | 9:29 AM

రోజుకో కొత్త రూల్స్‌తో ఇటు ఉద్యోగులు..అటు విద్యార్థులపై ఉక్కుపాదం మోపుతున్నారు అమెరికా అధ్యక్షుడు. గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకున్నవారికి ట్రంప్‌ అవలంభిస్తు్న్న విధానాలతో చుక్కలు కనిపిస్తున్నాయి. అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకొన్న భారతీయులు.. ప్రాసెసింగ్‌లో తీవ్ర జాప్యం ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఇమిగ్రేషన్‌ బ్యాక్‌లాగ్‌లో కోటి 13 లక్షల దరఖాస్తులున్నాయి. ఈ స్థాయిలో పెండింగ్‌లో ఉండటం ఓ రికార్డ్‌. ఇక ఈ ఏడాది రెండో త్రైమాసికంలో మరో 16 లక్షల కొత్త దరఖాస్తులు వచ్చి చేరనున్నాయి. ఇటీవల యూఎస్‌ సీఐఎస్‌ ప్రచురించిన డేటాషీట్‌లో ఈ వివరాలున్నాయి. ఇక రెండో త్రైమాసికంలో ప్రాసెస్‌ చేసిన దరఖాస్తుల సంఖ్య కూడా తగ్గింది. గతేడాది 3.3 మిలియన్లు చేయగా.. ఈసారి 2.7 మిలియన్లకే పరిమితమైంది. ఇక గ్రీన్‌కార్డ్‌ దరఖాస్తుదారులు వాడే ఫారమ్‌ ఐ-90 సగటు వెయిటింగ్‌ టైమ్‌ 0.8 నెలల నుంచి 8 నెలలకు చేరింది. ఫారమ్‌ ఐ-765ల్లో దాదాపు 2 మిలియన్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

అమెరికాలో ట్రంప్‌ సర్కారు వచ్చిన తర్వాత గ్రీన్‌కార్డులు, వీసాల జారీ, వలసపోవడం కష్టతరంగా మారాయి. అయితే.. వీటిల్లో వీసాలు, గ్రీన్‌కార్డుల జారీలో జాప్యం వల్ల ఇప్పుడు ఆ దేశ కార్పొరేట్‌ రంగంపై దుష్ప్రభావం చూపడం మొదలుపెట్టింది. వివిధ రంగాల్లోని కార్పొరేట్‌ లీడర్లు, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ల వర్క్ పర్మిట్‌లు ముగియడం.. వాటి పునరుద్ధరణ వెంటనే జరగకపోవడంతో వారు పదవుల నుంచి వైదొలగాల్సి వస్తోంది.

ముఖ్యంగా శాశ్వత నివాసం కల్పించే గ్రీన్‌కార్డ్‌ల జారీలో జాప్యం వల్ల.. సక్రమమార్గంలో దేశంలోకి వచ్చి కొన్నేళ్లుగా వివిధ కంపెనీల్లో పని చేస్తున్నవారు కూడా వెళ్లిపోయేటట్లు చేస్తోంది. మరి ఈ విషయంలో ట్రంప్‌ సర్కారు ఏం చేస్తుందో చూడాలి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..