Trump Announces New Lawyers: అమెరికా చరిత్రలో ట్రంప్ అధికారాన్ని వీడినట్లు మారే అధ్యక్షుడు వీడిఉండరు కాబోలు. అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ అగ్రరాజ్య అధ్యక్ష పదవిని వీడారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా తాను పదవి నుంచి దిగేది లేదని కోర్టుల చుట్టు తిరిగిన ట్రంప్ పెద్ద చర్చకే దారి తీశారు.
ఈ క్రమంలోనే ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, జనవరి 6న క్యాపిటల్ భవనంపై జరిగిన దాడికి ట్రంపే కారణమని వాదనలు వినిపించాయి. ఇందులో భాగంగానే డెమోక్రాట్లు ట్రంప్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి ట్రంప్ సొంత రిపబ్లికన్ పార్టీకి చెందిన 10 మంది సభ్యులు మద్దతు ఇవ్వడంతో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. దీంతో ఈ నెల 8వ తేదీన అభిశంసనపై విచారణకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలోనే ట్రంప్ తన తరఫున వాదించడానికి ప్రముఖ లాయర్లు డేవిడ్ ష్కోయెన్, బ్రూస్ ఎల్ కాస్టర్ నియమించుకున్నారు. ఇదిలా ఉంటే ఒకవేళ ట్రంప్ అభిశంసన తీర్మానం గనుక ఆమోదం పొందితే.. ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం కోల్పోతారు. మరి ట్రంప్ రాజకీయ భవితవ్వం ఎలా మారనుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Also Read: Captain Tom Moore : వన్ మాన్ ఫండ్ రైజింగ్ మెషిన్‌కు కరోనా పాజిటివ్.. బెడ్‌ఫోర్డ్ ఆసుపత్రిలో చికిత్స