NASA: ఆ ఫోటో షేర్ చేసినందుకు నాసా పై ట్రోలింగ్..ట్రోలర్స్ పై విరుచుకుపడి నాసాకు మద్దతిచ్చిన నెటిజన్లు!

NASA: నాసా ఇటీవల చేసిన ఒక పని ఇంటర్ నెట్ లో విపరీతంగా ట్రోల్ అవుతోంది. అది భారతీయ ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయం కావడం గమనార్హం.

NASA: ఆ ఫోటో షేర్ చేసినందుకు నాసా పై ట్రోలింగ్..ట్రోలర్స్ పై విరుచుకుపడి నాసాకు మద్దతిచ్చిన నెటిజన్లు!
Nasa
Follow us

| Edited By: KVD Varma

Updated on: Jul 14, 2021 | 9:21 AM

NASA: నాసా ఇటీవల చేసిన ఒక పని ఇంటర్ నెట్ లో విపరీతంగా ట్రోల్ అవుతోంది. అది భారతీయ ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయం కావడం గమనార్హం. నాసా ఇటీవల కొత్త ఇంటర్న్ ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ సందర్భంగా తన మాజీ ఇంటర్న్ ల కొన్ని ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేసింది. యూఎస్ అంతరిక్ష సంస్థలో పనిచేస్తున్న ప్రజల వైవిధ్యాన్ని ప్రదర్శించాలనే ఆలోచనతో ఈ పని చేశారు. అయితే, ఈ ప్రయత్నాన్ని విమర్శిస్తూ అనేకమంది నాసాను ఉద్దేశించి కామెంట్స్ చేశారు.

ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే.. మొత్తం నలుగురు ఇంటర్న్ ల చిత్రాలను నాసా షేర్ చేసింది. వీరిలో ఒకరు భారతీయ అమెరికన్ అమ్మాయి. ఈమె నాసా లోగోతో ఉన్న ఊలుకోటు ధరించి కూర్చుని ఉన్నారు. ఆమె పక్కన డెస్క్ పై హిందూ దేవుళ్ళ బొమ్మలు వెనుక గోడపై దేవుళ్ళ చిత్ర పటాలు ఉన్నాయి. వాటిని చూసిన నెటిజన్లు ఒక రేంజిలో నాసాపై ట్రోలింగ్ మొదలు పెట్టారు. యూఎస్ అంతరిక్ష సంస్థ ఒక శాస్త్రీయ సంస్థ అని అంటున్న నెటిజన్లు.. ఏవిధంగా దేవుణ్ణి విశ్వసించే వారిని తన ఇంటర్న్ షిప్ కు అనుమతిస్తారంటూ ప్రశ్నలు సంధించారు. అంతేకాకుండా కొందరు మితిమీరి కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్లో కొన్ని హిందూఫోబియాను సూచించే విధంగా కూడా ఉన్నాయి.

అయితే, నాసాకు ఈ ట్రోలింగ్ విషయంలో అదేస్థాయిలో మద్దతు వచ్చింది. ట్రోలర్స్ ను ఎదుర్కుంటూ పలువురు నాసా తరఫున.. ఆ ఫోటోలోని అమ్మాయి తరఫున పోస్ట్ లు పెట్టారు. ఆమె తన డెస్క్ మీద దేవుళ్ళ విగ్రహాలు ఉంచుకోవడంలో తప్పేముంది అంటూ ఎదురుదాడికి దిగారు. నాసా చేసిన పనిలో అస్సలు తప్పు లేదన్నారు. ఆమె వ్యక్తిగత పరిస్థితులను నాసా అడ్డుకోకపోవడం గొప్పవిషయం అంటూ సపోర్ట్ చేశారు. అంతేకాదు, ఇటువంటి పనికిమాలిన విషయాలపై ట్రోలింగ్ చేయకుండా పనికొచ్చే విషయాల గురించి ఆలోచించమని హితవు చెబుతూ కొందరు పోస్ట్ చేశారు. ఇలా ఎదురుదాడి మొదలవడంతో ట్రోలర్స్ వెనక్కి తగ్గారు. తమ కామెంట్ల జోరును ఆపేశారు. మొత్తమ్మీద నాసా చేసిన పనిని సమర్ధించిన వారే ఎక్కువగా ఉండడం గమనించాల్సిన విషయం.

ఒక యూజర్ ట్విట్టర్‌లో ఇలా కామెంట్ చేశారు “ఆమెను ఎగతాళి చేసే వారందరికీ.. హిజాబ్, బహుభార్యాత్వం, బాల్యవివాహాలు, నికాబ్, రహదారిపై ప్రార్థనలు మొదలైనవి ‘ఎంపిక’, ‘బహువచనం’ అనే భావన క్రింద గౌరవించబడాలి. కానీ, తన విశ్వాసాన్ని పాటిస్తున్న హిందూ మహిళను ఎగతాళి చేయాలి. కొనసాగించండి! మీ మూర్ఖత్వం ఆమె విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది. ”

“చాలా మంది ప్రజలు తమ సాధారణ మూర్ఖత్వం, జాత్యహంకారాన్ని బహిర్గతం చేస్తున్నారు. ఒక మైనారిటీ అమ్మాయిని విభేదిస్తున్నప్పుడు.. అన్నీ ఆమె మూలాల గురించి గర్వపడుతున్నాయి” అని మరొకరు కామెంట్ చేశారు.

నాసా ట్విట్టర్ లో చేసిన పోస్ట్ ఇదే..

నిజానికి ఈ ఫోటోలో మహిళ నేపధ్యంలో కనిపించిన లక్ష్మీ, సరస్వతీ ఇతర దేవుళ్ళ విగ్రహాలు భారతీయ గృహాలలో సాధారణంగా కనిపించే దృశ్యమే. ఆ మహిళా భారతీయురాలు అయినందున సహజంగానే ఫోటోలో అలా కనిపించింది.

Also Read: Ethiopia Clashes: అంతర్యుద్దంతో అట్టుడుకుతున్న ఇథియోపియా.. చిక్కుకున్న తెలుగు కుటుంబాలు..

హైతీ అధ్యక్షుని హత్య ఘటనలో అమెరికాకు లింకు ఉందా .? దర్యాప్తులో షాకింగ్ డీటెయిల్స్ !

Latest Articles
పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్
పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్
మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..
మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..
బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే
బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
సెకండ్ ఇన్నింగ్స్ లో కొత్త ట్రెండ్.. జ్యోతిక స్పీడ్ మాములుగా లేదు
సెకండ్ ఇన్నింగ్స్ లో కొత్త ట్రెండ్.. జ్యోతిక స్పీడ్ మాములుగా లేదు
ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.!
ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.!
కొత్త స్విఫ్ట్‌ వచ్చేసిందోచ్‌.. లుక్స్‌, ఫీచర్స్‌ అదుర్స్‌ అంతే..
కొత్త స్విఫ్ట్‌ వచ్చేసిందోచ్‌.. లుక్స్‌, ఫీచర్స్‌ అదుర్స్‌ అంతే..
గత అనుభవాలను దృష్టితో పెద్ద టార్గెట్ః కిషన్‌రెడ్డి
గత అనుభవాలను దృష్టితో పెద్ద టార్గెట్ః కిషన్‌రెడ్డి
భారత మార్కెట్లోకి మరో ఇంట్రెస్టింగ్‌ స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్స్‌
భారత మార్కెట్లోకి మరో ఇంట్రెస్టింగ్‌ స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్స్‌
శుభ్ మన్ గిల్, సుదర్శన్ సెంచరీల మోత.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
శుభ్ మన్ గిల్, సుదర్శన్ సెంచరీల మోత.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట