నేడు సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎవరూ చూడలేమట..!

నేడు పలు దేశాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్లే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణం అమావాస్య నాడు మాత్రమే వస్తుంది. కానీ.. ప్రతీ అమావాస్యకు సూర్యగ్రహణం ఏర్పడదు. కాగా.. పూర్తి సూర్యగ్రహణం ఏర్పడితే 8 నిమిషాలకు మించి ఉండదు. ఈ సంవత్సరంలో ఏర్పడే రెండో సూర్యగ్రహణం జులై 2న అనగా ఇవాళ రాత్రి 10:21 నిమిషాలకు ప్రారంభమయి 2:15 నిమిషాలకు సమాప్తమవుతుంది. అయితే.. చైనా, చిలీ, అర్జెంటీనా, ఉత్తర అమెరికాలో సూర్యగ్రహణం […]

నేడు సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎవరూ చూడలేమట..!

Edited By:

Updated on: Jul 02, 2019 | 10:20 AM

నేడు పలు దేశాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్లే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణం అమావాస్య నాడు మాత్రమే వస్తుంది. కానీ.. ప్రతీ అమావాస్యకు సూర్యగ్రహణం ఏర్పడదు. కాగా.. పూర్తి సూర్యగ్రహణం ఏర్పడితే 8 నిమిషాలకు మించి ఉండదు. ఈ సంవత్సరంలో ఏర్పడే రెండో సూర్యగ్రహణం జులై 2న అనగా ఇవాళ రాత్రి 10:21 నిమిషాలకు ప్రారంభమయి 2:15 నిమిషాలకు సమాప్తమవుతుంది. అయితే.. చైనా, చిలీ, అర్జెంటీనా, ఉత్తర అమెరికాలో సూర్యగ్రహణం ప్రభావం కనబడుతుందని సైంటిస్టులు పేర్కొన్నారు. ఈ సంవత్సరంలో డిసెంబర్ 26న ఏర్పడే మరో సూర్య గ్రహణం మాత్రం మన దేశంలో కనిపిస్తుందని తెలిపారు.