
ప్రస్తుత డిజిటల్ యుగంలో, సోషల్ మీడియా ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. సమాచార వ్యాప్తి నుండి సామాజిక సంబంధాల వరకు ఇది విస్తరించింది. ఇన్‌స్టాగ్రామ్, టిక్ టాక్ వంటివి వచ్చాక దీని ప్రభావం ప్రజలపై మరింత పెరిగిపోయింది. ఇక సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం కొందరు యువకులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలానే కొన్ని రోజుల్లో భూకంపం వస్తుందని ప్రజలను భయాందోళనకు గురిచేసేలా టిక్‌టాక్‌లో తప్పుడు ప్రచారం చేసిన 21 ఏళ్ల జ్యోతిష్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం
జాన్ మో ది అనే జ్యోతిష్కుడు త్వరలో మయన్మార్‌లో మరో పెద్ద భూకంపం రాబోతోందని టిక్‌టాక్‌లో ఓ పోస్ట్ చేశాడు. ఈ భూకంపం ఏప్రిల్ 21న మయన్మార్‌లోని ప్రతి నగరాన్ని తాకుతుందని ఆ వీడియోలో హెచ్చరించారు. భూ కంపం వచ్చే ముందే మీరు ఉన్న భవనాలను ఖాళీ చేయాలని.. మీ ఇంట్లో ఉండే విలువైన వస్తువులను మీతో పాటు తీసుకెళ్లాలని వీడియోలో జోతిష్యుడు పేర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే మూడు లక్షలకుపైగా ఫాలోవర్స్ ఉన్న ఆ జ్యోతిష్యుడు పోస్ట్ చేసిన వీడియో క్షణాల్లో వైరల్ అయిపోయింది. దీంతో అది నిజమేనని నమ్మిన ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నిజంగానే ఏప్రిల్ 21 భూకంపం వస్తుందని నమ్మిన కొందరు ప్రజలు వాళ్ల ఇళ్లను వదిలి బయట క్యాంప్‌లు వేసుకొన్నట్టు ఓ స్థానికుడు తెలిపారు.
Coming Soon to 🇺🇸
LAWS against
FRAUD Numerologists
FRAUD Astrologers♒️AGE of AQUARIUS♒️#GG33 KNOWShttps://t.co/huj9xq2u5f
— VeeRooPaa🍊 (@GG33Network) April 26, 2025
అయితే ఈ జ్యోతిష్యుడు ఇంతకుముందు కూడా ఇలాంటి వివాదాస్పద అంచనాలలో వీడియోలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ప్రజలను భయాందోళనకు గురిచేసే ఉద్దేశ్యంతో తప్పుడు ప్రకటనలు చేసినందుకు” 21 ఏళ్ల జ్యోతిష్యుడిని మంగళవారం అరెస్టు చేసినట్లు మయన్మార్ సమాచార మంత్రిత్వ శాఖ బిబిసి తెలిపింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లియ్ చేయండి…!